మార్కో యాన్సెన్ స్టన్నింగ్ క్యాచ్.. ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా ఘన విజయం! (వీడియో)
సౌతాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా ఓటమితో ప్రారంభించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా డర్బన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. మార్కో యాన్సెన్(75, 1/64, నాలుగు క్యాచ్‌లు)ఆల్‌రౌండ్ షోతో సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మాథ్యూ బ్రిట్జ్‌కే శతకం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 297 పరుగులు చేసింది. మాథ్యూ బ్రిట్జ్‌కే(106 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 112) సెంచరీతో రాణించగా.. మార్కో జాన్సెన్(59 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్(3/57) మూడు వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా(2/50) రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ హజెల్ వుడ్(1/50) ఒక వికెట్ తీసాడు.

అనంతరం ఆస్ట్రేలియా 41.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్(36 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించగా..మ్యాట్ రేన్‌షా(49 బంతుల్లో 6 ఫోర్లతో 44) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్(4/20) నాలుగు వికెట్లు తీయగా.. కార్బిన్ బోష్, బ్యోర్న్ ఫోర్టుయిన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయిట్జీ తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
మార్కో యాన్సెన్ స్టన్నింగ్ క్యాచ్..
ఈ మ్యాచ్‌లో మార్కో యాన్సెన్ ఏకంగా నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్ రేన్ షా ఇచ్చిన క్యాచ్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. గెరాల్డ్ కోయిట్జీ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ రెన్‌షా(44) భారీ షాట్‌కు ప్రయత్నించాడు. బౌండరీ వైపు దూసుకెళ్తున్న బంతిని మార్కో యాన్సెన్ కుడివైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను చూసి బ్యాటర్‌తో పాటు అందరూ స్టన్ అయ్యారు. ఈ క్యాచ్‌తోనే ఆస్ట్రేలియా ఓటమి ఖాయమైంది.
సచిన్ వరల్డ్ రికార్డ్ సమం..
అంతర్జాతీయ వన్డేల్లో ఓ హాఫ్ సెంచరీతో పాటు నాలుగు క్యాచ్‌లు , ఒక వికెట్ తీసిన తొలి సౌతాఫ్రికా ఆటగాడిగా మార్కో యాన్సెన్ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఆస్ట్రేలియాపై ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా కూడా రికార్డు సాధించాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.
1998లో పాకిస్థాన్‌పై సచిన్ ఈ ఫీట్ సాధించాడు. బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్ 67 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీసి నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. యూనిస్ ఖాన్, మైఖేల్ క్లార్క్, మార్నస్ లబుషేన్‌లు మార్కో జాన్సెన్ కంటే ముందు ఈ ఫీట్ సాధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


