హార్దిక్ పాండ్యా- సీఎస్‌కే ట్రేడ్ డీల్ క్యాన్సిల్‌కు అతనే కారణం!
ఐపీఎల్ 2027 సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ డీల్ ద్వారా తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే), కోల్‌కతా నైట్‌రైడర్స్ తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో సీఎస్‌కే వెనకడుగు వేసినట్లు ప్రచారం జరిగింది.
మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా హార్దిక్ పాండ్యా జట్టులోనే కొనసాగుతాడని అధికారికంగా ప్రకటించింది. కానీ కెప్టెన్‌గా అతన్ని కొనసాగించేందుకు ముంబై మేనేజ్‌మెంట్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా తన పాత ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌తో కూడా చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
కెప్టెన్సీ ఇస్తే తిరిగి జట్టులోకి వస్తానని హార్దిక్ పాండ్యా చెప్పాడని, కానీ ఆ ప్రతిపాదనను గుజరాత్ మేనేజ్‌మెంట్ తిరస్కరించిందని ప్రచారం జరిగింది. నవంబర్ 15న ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ముగియనుండటంతో ట్రేడింగ్ వ్యహారం మరింత హీటెక్కింది.

అయితే హార్దిక్ పాండ్యా విషయంలో సీఎస్‌కే వెనకడుగు వేయడానికి ఆ జట్టు నయా హెడ్ కోచ్ జహీర్ ఖాన్ కారణమని తెలుస్తోంది. ఇటీవలే జహీర్ ఖాన్ సీఎస్‌కే హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతోనే హార్దిక్ పాండ్యా రాకను జహీర్ ఖాన్ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. సీఎస్‌కే, కేకేఆర్ తీసుకోకపోతే.. హార్దిక్ పాండ్యా ఆటగాడిగా ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగుతాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌ను బీసీసీఐ నిశితంగా పర్యవేక్షిస్తోంది.
గాయం కారణంగా న్యూజిలాండ్ పర్యటనకు హార్దిక్ పాండ్యా దూరమైనప్పటికీ.. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతను కీలక ఆటగాడిగా కొనసాగనున్నాడు. అతని గాయాల చరిత్ర నేపథ్యంలో ఐపీఎల్ 2027 సీజన్ మొత్తానికి హార్దిక్ దూరమయ్యే అవకాశం కూడా ఉంది. గతంలో జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా, జహీర్ ఖాన్ విభేదాలు తలెత్తినట్లు సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


