Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనారోగ్యంతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

Legendary Indian First Class Cricketer Rajinder Goel dies aged 77

కోల్‌కతా: భారత దేశవాళీ క్రికెట్‌ దిగ్గజం రాజిందర్‌ గోయెల్‌ కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న 77 ఏళ్ల గోయెల్‌.. రోహ్‌తక్‌లోని తన నివాసంలో ఆదివారం మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. రాజిందర్‌కు భార్య, కుమారుడు నితిన్‌ గోయెల్‌ ఉన్నారు. నితిన్‌ కూడా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడాడు. యునైటెడ్ పంజాబ్ నర్వాణ నగరంలో 1942లో జన్మించిన గొయెల్.. 1958 నుంచి 1985 వరకు దేశవాళీ క్రికెట్‌లో చెరగని ముద్ర వేశారు.
 150 మ్యాచ్‌లు.. 750 వికెట్లు

150 మ్యాచ్‌లు.. 750 వికెట్లు

ఇక హరియాణా, నార్త్‌జోన్‌ జట్లకు ప్రాతినిథ్యం వహించిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రాజిందర్‌.. తన 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 157 మ్యాచ్‌లు ఆడి 750 వికెట్లు తీశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ రికార్డు ఇప్పటికీ రాజిందర్‌ గోయెల్‌ పేరిటే ఉంది. 70వ దశకంలో గొప్ప స్పిన్నర్‌గా ఖ్యాతిగాంచిన గోయెల్.. 18సార్లు పది వికెట్ల ఘనతను సాధించడం విశేషం. ఆయన రంజీల్లో మొత్తం 637 వికెట్లు పడగొట్టారు.

సచిన్ విషయంలో చేసిన ఆ తప్పులతో నిద్ర పట్టేది కాదు: దిగ్గజ అంపైర్

బేడీతో దక్కని అవకాశం..

బేడీతో దక్కని అవకాశం..

ఇంతటి విశేష ప్రతిభ కనబరిచిన రాజిందర్‌ భారత జట్టుకు మాత్రం ఆడలేకపోయారు. అయితే 1964-65 సీజన్‌లో అహ్మదాబాద్‌లో శ్రీలంకతో జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్‌ ఆడారు. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశారు. బిషన్‌ సింగ్‌ బేడీ అద్భుతమైన స్పిన్నర్‌గా జట్టుకు అందుబాటులో ఉండటంతో సెలక్టర్లు గోయెల్‌వైపు చూడలేకపోయారు. అయితే ఓ సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో మాత్రం గోయెల్‌కు అవకాశం దక్కలేదు. బేడీ గైర్హాజరీతో 1974లో బెంగళూరు వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్‌కు గోయెల్‌కు పిలుపు అందింది. అతను కూడా తన అరంగేట్రం ఖాయమని భావించాడు. కానీ తుది జట్టులో చోటు దక్కలేదు.

 సీకే నాయుడు పురస్కారం..

సీకే నాయుడు పురస్కారం..

అయినప్పటికీ దేశవాళీ క్రికెట్‌లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన రాజిందర్‌ సేవలకు గుర్తింపుగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2017లో ‘సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం' అందజేసింది. 44వ ఏట వరకు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడిన రాజిందర్‌..హరియాణతో పాటు పంజాబ్, ఢిల్లీ జట్లకూ ప్రాతినిధ్యం వహించారు. రిటైర్మెంట్ అనంతరం గోయెల్.. కోచ్‌గా, జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా కూడా సేవలందించారు.

బీసీసీఐ సంతాపం..

బీసీసీఐ సంతాపం..

హరియాణా క్రికెట్‌ అభివృద్ధికి ఎంతో సేవ చేసిన గోయెల్‌ మరణం తమకు తీరని లోటని హరియాణా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు కుల్తార్‌ సింగ్‌ మలిక్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశవాళీ క్రికెట్‌కు పూడ్చలేని నష్టమని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రణ్‌బీర్‌ సింగ్‌ మహేంద్ర అన్నారు. గోయల్‌ మృతి పట్ల బీసీసీఐ కూడా సంతాపం వ్యక్తం చేసింది. ఇక మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సైతం గోయల్ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేస్తున్నారు.

నాన్నకు ప్రేమతో అంటూ ఏమోషనల్ అయిన కోహ్లీ

Story first published: Monday, June 22, 2020, 8:18 [IST]
Other articles published on Jun 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+