ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యను పెంచాలి: లలిత్ మోదీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిర్వాహణలో భారీ మార్పులు చేయాలని ఈ లీగ్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ పిలుపునిచ్చారు. మ్యాచ్‌ల సంఖ్యను 94కి పెంచాలని, టోర్నీని జనవరిలోనే ప్రారంభించాలని బీసీసీఐకి సూచించారు. ఈ మార్పులకు వీలుగా అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌ను సర్దుబాటు చేసేందుకు ఐసీసీ ఛైర్మన్ జైషా సాయం చేయాలని కోరారు. అక్టోబర్-ఏప్రిల్ మధ్య ఐపీఎల్ కోసం అత్యుత్తమ విండోను ఎంపిక చేయాలన్నారు.
తాజాగా క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ ఈ ప్రతిపాదనలు చేశారు. ' 2008లో ఐపీఎల్ ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే విండో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అప్పట్లో 8 జట్లతో 59 మ్యాచ్‌లు జరిగేవి. కానీ ఇప్పుడు బీసీసీఐ జట్ల సంఖ్యను 10కి పెంచింది. 10 జట్లతో హోమ్ అండ్ అవే ఫార్మాట్‌లో ఆడించాలంటే 94 మ్యాచ్‌లు నిర్వహించాలి. పాత ఫార్మాట్‌తో పోల్చితే మ్యాచ్‌ల సంఖ్య 60 శాతం ఎక్కువ.

ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా సుదీర్ఘ సీజన్‌లో ఐపీఎల్‌ను నిర్వహించాలి. ఫుట్‌బాల్ లీగ్స్ మాదిరిగా వీకెండ్స్ మ్యాచ్‌లతో మంచి మైదానాల్లో అభిమానులకు మంచి అనుభూతిని అందించవచ్చు. భవిష్యత్తులో ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ టోర్నీల ద్వారా వచ్చే ఆదాయం తగ్గే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐకి ఐపీఎల్ ఒక సంజీవనిగా మారుతుంది. అందుకే ముందుచూపుతో ప్రణాళికలు రచించాలి.
ఐపీఎల్‌కు అనుకూలమైన విండో దొరకలంటే ఐసీసీ ఛైర్మన్ జైషా సాయం అవసరం. ఇతర దేశాల బోర్డుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఒక ఒప్పందాన్ని కుదర్చాలి. అలా చేస్తే జైషా హయాంలోనే ఇది చారిత్రాత్మక విజయంగా నిలుస్తుంది. బీసీసీఐ సెక్రటరీగా జైషా పదవి కాలంలో 2023-27 సంబంధించిన ఐపీఎల్ మీడియా రైట్స్‌ను రూ.48,390 కోట్లకు అమ్మారు. ఇప్పుడు ఆయన ఐపీఎల్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడగలరు. 2008 నాటి పరిస్థితులకు అనుగుణంగా ఐపీఎల్‌ను నిర్మించాం. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఐపీఎల్‌ను రిడిజైన్ చేయాల్సిన అవసరం ఉంది.'అని లలిత్ మోదీ అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


