Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీ.. వన్డే ప్రపంచకప్ కూడా ఆడాలి: మాజీ క్రికెటర్

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి వన్డే ప్రపంచకప్ 2027లో కూడా ఆడే అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృషన్ అన్నారు. విశ్రాంతి ఇవ్వకుండా వరుసగా మ్యాచ్‌లు ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించారు.

ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా శనివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20తో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అతిపిన్న భారత ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డ్‌ను 15 ఏళ్ల వైభవ్ బద్దలు కొట్టాడు. అయితే తన అరంగేట్రాన్ని వైభవ్ ఘనంగా మార్చుకోలేకపోయాడు. 10 బంతుల్లో 2 సిక్స్‌లతో 14 పరుగులే చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.

L Sivaramakrishnan Urges Team India to consider 15-year-old Vaibhav Sooryavanshi for the 2027 World Cup

తాజాగా వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడిన శివరామకృష్ణన్.. వన్డే ప్రపంచకప్‌లో ఆడించాలనే కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో టీమిండియా మ్యాచ్‌ విన్నర్‌గా ఎదుగుతాడని జోస్యం చెప్పాడు. విఫలమైనా అతనికి వరుసగా అవకాశాలు ఇవ్వాలని, విశ్రాంతి పేరిట పక్కన పెట్టవద్దని సూచించాడు.

'వైభవ్ సూర్యవంశీని ఆడించాలని నిర్ణయించుకున్న తర్వాత.. అతనికి తగినన్న అవకాశాలు ఇస్తూనే ఉండాలి. రాబోయే 20 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు అతను ఒక పెద్ద పెట్టుబడిగా మారుతాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అతనికి పూర్తి మద్దతు ఇవ్వాలి. కొన్ని మ్యాచ్‌ల్లో అతను సరిగ్గా ఆడకపోయినా.. అతన్ని జట్టు నుంచి తొలగించకూడదు.

అంతేకాకుండా వైభవ్‌కు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం లేదు. బౌలర్లకు అవసరమైనంత ఫిట్‌నెస్ బ్యాటర్లకు అవసరం లేదు. అతన్ని ఏడాది పొడవునా ఆడిస్తూనే ఉండాలి. ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం, బ్యాటింగ్ చేయడం వల్ల అతని మానసిక బలంతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది. వైభవ్ సూర్యవంశీ టీ20 ఫార్మాట్‌లో బాగా రాణిస్తే.. అతనికి 50 ఓవర్ల ప్రపంచకప్‌లో కూడా తప్పకుండా అవకాశం ఇవ్వాలి. అతను వైట్‌బాల్ క్రికెట్‌లో భారత ప్రధాన మ్యాచ్ విన్నర్‌గా ఎదుగుతాడు.'అని శివరామకృష్ణన్ జోస్యం చెప్పాడు.

Story first published: Monday, July 6, 2026, 12:18 [IST]
Other articles published on Jul 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+