IND vs ENG: రవి బిష్ణోయ్ ఔట్?.. ఇంగ్లాండ్‌తో మూడో టీ20లో ఆడే భారత తుది జట్టు ఇదే!
IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. రెండో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ ఓటమితో చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో టీ20 మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. జులై 7వ తేదీ మంగళవారం నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో ఈ ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.
ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత మాజీ పేసర్ ఇర్భాన్ పఠాన్ టీమిండియా ఆటతీరుపై జట్టు యాజమాన్యానికి కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న బౌలింగ్ విభాగంలో సమతుల్యత లోపించిందని.. దీనివల్ల జట్టు మ్యాచ్‌లను చేజార్చుకావాల్సి వస్తోందని పఠాన్ స్పష్టం చేశాడు. రెండో మ్యాచ్‌లో భారత్ కేవలం ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతోనే బరిలోకి దిగడం వ్యూహాత్మక తప్పిదమని ఆయన తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా విశ్లేషించారు.

శివమ్ దూబే వంటి ఆల్‌రౌండర్ జట్టులో ఉన్నప్పటికీ అతడితో బౌలింగ్ చేయించనప్పుడు.. కేవలం ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగితే కెప్టెన్ కు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు తగ్గిపోతాయని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు. డెత్ ఓవర్లతో పాటు పవర్ ప్లేలో కూడా స్పిన్నర్లపైనే ఎక్కువ ఆధారపడాల్సి వస్తుందన్నారు. పిచ్‌పై కాస్త సీమ్ లేదా మూమెంట్ ఉన్నప్పుడు అదనపు పేసర్ లేకపోవడం వల్ల ఈ ప్రయోజనాన్ని అందుకోలేమని ఆయన అభిప్రాయపడ్డారు.
రవి బిష్ణోయ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం?
నాటింగ్ హామ్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో పాటు ఇక్కడి చల్లని వాతావరణం, ఉదయం పూట ఉండే తేమ వల్ల ఆరంభంలో పేసర్లకు మంచి స్వింగ్ లభిస్తుంది. ఈ పరిస్థితులను ఉపయోగించుకుని ప్రత్యర్థిని దెబ్బకొట్టాలంటే స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్థానంలో పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించారు. బలమైన పేస్ విభాగంతో బరిలోకి దిగితేనే ఇంగ్లాండ్ జట్టును కట్టడి చేయడం సాధ్యమవుతుందని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు.
రెండో టీ20 మ్యాచ్‌లో అర్ష్ దీప్ సింగ్ వికెట్లు తీసి రాణించినప్పటికీ..హర్షిత్ రాణా కొత్త బంతితో అనుకున్నంత ప్రభావం చూపలేకపోయాడు. కీలక బౌలర్ ఫామ్‌లో లేనప్పుడు అదనపు పేసర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించారు. ఒక వేళ జట్టు యాజమాన్యం రవి బిష్ణోయ్ ను కొనసాగించాలనుకుంటే.. అతను తన రన్-అప్ సమస్యలను సరిదిద్దుకోవాలని.. గత మ్యాచ్ లో నో-బాల్స్ కారణంగానే పరుగులు సమర్పించుకున్నాడని ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేశారు.
ఇంగ్లాండ్ జట్టుతో మూడో టీ20 కోసం భారత తుది జట్టు అంచనా:
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications