Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2027 వన్డే వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ?

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన అనంతరం వైభవ్ సూర్యవంశీని కేవలం టీ20లకే పరిమితం చేయకుండా వెంటనే వన్డే జట్టులోకి కూడా తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా బరిలోకి దించాలనే సరికొత్త చర్చకు మాజీ క్రికెటర్లు తెరలేపారు.

భారత మాజీ క్రికెటర్ ఎల్.శివరామకృష్ణన్ దీనిపై స్పందిస్తూ.. ఈ యువ ఆటగాడికి విశ్రాంతి ఇవ్వడం కంటే నిరంతరం ఆడే అవకాశం కల్పించాలని ఆయన సూచించారు. అలా చేయడం వల్ల వైభవ్ సూర్యవంశీకి వివిధ రకాల పిచ్‌లు, పరిస్థితులపై అవగాహన రావడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తప్పుల నుంచి నేర్చుకునే అనుభవం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్ జట్టుతో మాంచెస్టర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్‌లో కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే భారత్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. అతి చిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో వైభవ్ కేవలం 10 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 14 పరుగులు చేసి తన దూకుడును ప్రదర్శించాడు.

Vaibhav Sooryavanshi as Opener with Rohit Sharma L Sivaramakrishnan Demands 2027 World Cup Spot

తాను కూడా 1983లో వెస్టిండీస్‌పై కేవలం 17 ఏళ్ల వయస్సులోనే టెస్ట్ అరంగేట్రం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్న శివరామకృష్ణన్.. జట్టు యాజమాన్యం వైభవ్ సూర్యవంశీపై నమ్మకం ఉంచినప్పుడు అతనికి తగినన్ని అవకాశాలు ఇవ్వాలని సూచించారు. యువ ప్లేయర్‌ను జట్టులోకి తీసుకుని.. ఆ తర్వాత వెంటనే విశ్రాంతి ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడు విశ్రాంతి అవసరం లేదని.. ఏడాది పొడవునా ఆడిస్తూనే ఉండాలని శిమరామకృష్ణన్ సూచించారు.

ఓ బ్యాటర్ గా వైభవ్ సూర్యవంశీకి బౌలర్ల తరహాలో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లేదా ఫిట్నెస్ సమస్యల లాంటివి ఉండవని.. ఎక్కువ సమయం క్రీజులో గడపడం వల్ల అతని ఏకాగ్రత పెరుగుతుందని శివరామకృష్ణన్ పేర్కొన్నారు. వైభవ్ సూర్యవంశీ రాబోయే 20 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు ఉపయోగపడే ఓ గొప్ప పెట్టుబడి అంటూ కొనియాడారు. ఈ కీలక సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, జట్టులోని ఇతర సీనియర్ల మద్దతు వైభవ్ సూర్యవంశీకి ఎంతో అవసరమని.. ఒకవేళ ఒకట్రెండు మ్యాచ్‌ల్లో విఫలవమైనప్పటికీ.. అతడిని జట్టు నుంచి తొలగించకుండా అండగా నిలవాలని కోరారు.

వైభవ్ లాంటి మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్‌ను వన్డే క్రికెట్లో కూడా పరీక్షించాలని.. వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచ కప్ కు టీమిండియా టాపార్డర్‌లో వైభవ్ సూర్యవంశీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉందని శివరామకృష్ణన్ గట్టిగా విశ్వసిస్తున్నారు. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగి రోహిత్ శర్మతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే భారత క్రికెట్లో అది ఓ సరికొత్త అధ్యాయం అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Story first published: Sunday, July 5, 2026, 21:52 [IST]
Other articles published on Jul 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+