For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాంబు పడాలని సరదాగా కోరుకుంటే.. నిజంగానే ఉగ్రదాడి జరిగింది: సంగక్కర

Kumar Sangakkara recalls 2009 attack on Sri Lankan team bus

ముంబై: 2009 పాకిస్థాన్‌ పర్యటనలో బాంబు పడాలని సరదాగా అనుకుంటే నిజంగానే తమపై ఉగ్రదాడి జరిగిందని శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర తెలిపాడు. ఆ టూర్‌లో భాగంగా రెండో టెస్ట్ మూడో రోజు ఆట కోసం లాహోర్ స్టేడియానికి బయలుదేరిన శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ముష్కరులు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఆ ఉగ్రదాడి ఎలా జరిగిందో తాజాగా సంగక్కర గుర్తు చేసుకున్నాడు. ముష్కరులు వరుస పెట్టి గ్రెనేడ్లు, బాంబులు, తుపాకులు ప్రయోగించారని, బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతోనే ప్రాణాలతో బయటపడ్డామని స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

జోక్‌గా అంటే నిజంగానే బాంబులు పడ్డాయి..

జోక్‌గా అంటే నిజంగానే బాంబులు పడ్డాయి..

‘ఆ రోజు ఎప్పటిలానే మేం బస్సులో సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఈ సాయంత్రం ఏం చేద్దామని కొందరు అనుకుంటున్నారు. ‘ఇక్కడ వికెట్లన్నీ ఫ్లాట్‌గా ఉన్నాయి. గాయాలయ్యే అవకాశం ఉంది. ఏదైనా బంబు పడితే.. ఏంచక్కా ఇంటికి వెళ్లిపోవచ్చు'అని ఓ పేస్ బౌలర్ అన్నాడు. యాదృశ్చికంగా 20 సెకండ్ల తర్వాత అతను అన్నట్లుగానే మాపై ముష్కరులు దాడి చేశారు.'అని నాటి భయానక క్షణాలను సంగక్కర గుర్తు చేసుకున్నాడు.

మన పేస్ విప్లవానికి అతనే కారణం: వీవీఎస్ లక్ష్మణ్

టపాసులు అనుకున్నాం..

టపాసులు అనుకున్నాం..

తొలుత తుపాకీ తూటాల శబ్దం విని టపాసులు కాల్చుతున్నారనుకున్నామని, కానీ తమకు భద్రత కల్పిస్తున్న చాలా మంది నేలకూలడంతో ఉగ్రదాడని అర్థమైందని తెలిపాడు. ‘మా జట్టుకు గైడ్‌గా ఉన్న వ్యక్తి ముందు కూర్చున్నాడు. మేం తుపాకీ తూటాల శబ్దం విని పటాసులు కాలుస్తున్నారని అనుకున్నాం. కానీ ముందున్న వ్యక్తి ‘వెంటనే అందరూ పడుకోండి. మన బస్సుపై దాడి చేస్తున్నారు'అని అరిచాడు. ఆ సమయంలో దిల్షాన్ నా ముందున్నాడు. నేను బస్సులో మధ్యలో ఉన్నా. మహేళా జయవర్దనే నా వెనుకాల కూర్చున్నాడు. మురళీ నా కుడిపక్కన ఉన్నాడు. ఓపెనర్ తరంగా పరనవితన ముందున్నాడు. మేం ఒకరిపై ఒకరం పడుకున్నాం. కాల్పులు మరీ ఎక్కువయ్యాయి. గ్రెనెడ్లు కూడా విసిరారు. రాకెట్ లాంచ్‌లు ప్రయోగించారు. మేం ఎలా బతికిపడ్డామో ఇప్పటికీ తెలియదు'అని సంగక్కర చెప్పుకొచ్చాడు.

 బుల్లెట్ తాకిందని రక్తం చిందిస్తూ..

బుల్లెట్ తాకిందని రక్తం చిందిస్తూ..

‘ఆ దాడిలో థిలన్ గాయపడ్డాడు. నా భుజానికి తీవ్ర గాయమైంది. అజంతా మెండీస్ కూడా గాయపడ్డాడు. చాతిలో బుల్లెట్ తాకిందని రక్తం చిందిస్తూ తరంగ పరనవితన కిందపడిపోయాడు. బస్సు మొత్తం మా ఆర్తనాదాలతో మారుమోగింది. బస్సు డ్రైవర్‌ను చంపడానికి వారు ప్రయత్నించారు. కానీ ఇంచ్ వ్యత్యాసంలో అతను బతికిపోయాడు. అతడు బతికాడు కాబట్టే మేం ప్రాణాలతో బయటపడ్డాం. అతను మా హీరో. ఆ గ్రౌండ్ ఇరుకైన గేట్ నుంచి తీసుకెళ్లడానికి రోజూ అతను నాలుగు సార్లు ప్రయత్నించేవాడు. కానీ ఆ రోజు మాత్రం నేరుగా మైదానంలోకి తీసుకెళ్లాడు. దాంతో మేం మైదానంలో దిగి ఊపిరి పీల్చుకున్నాం. ఆ తర్వాత కాస్త తేరుకొని ప్రాణాలతో బయటపడ్డందుకు జోక్స్ వేసుకున్నాం. సరదాగా మాట్లాడుకున్నాం. మాకు మేం క్షమాపణలు చెప్పుకున్నాం. అయితే మాపైనే ఎందుకు దాడి చేశారనేది మాత్రం ఆలోచించలేదు'అని సంగక్కర పేర్కొన్నాడు.

 ఆటలు పదేళ్లు బంద్..

ఆటలు పదేళ్లు బంద్..

శ్రీలంక క్రికెటర్లపై జరిగిన ఈ ఉగ్రదాడితో యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెర పోయింది. ఆ తర్వాత ఏ దేశం పాక్‌లో పర్యటించడానికి సాహిసించలేదు. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఇదే శ్రీలంక జట్టు అక్కెడికెళ్లి ఓ సిరీస్ ఆడింది. ఇప్పటికీ తమ జట్లను పంపించాడనికి ఆయా క్రికెట్ బోర్డులు వెనుకాడుతున్నాయి. ఈ ఉగ్రదాడి పాక్‌ క్రికెట్‌ను తీవ్రంగా నష్టపరిచింది.

మొసలి కన్నీళ్లు కొన్నాళ్లే అంటూ బోల్డ్ పిక్‌ షేర్ చేసిన షమీ వైఫ్.. మండిపడుతున్న ఫ్యాన్స్!

Story first published: Friday, June 5, 2020, 13:33 [IST]
Other articles published on Jun 5, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+