అతనో వజ్రం.. వీలైతే సాన పెట్టండి కానీ ఆత్మ విశ్వాసం దెబ్బతీయవద్దు: క్రిష్ శ్రీకాంత్
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిష్ శ్రీకాంత్ మరోసారి ప్రశంసల జల్లు కురిపించాడు. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో అతన్ని ఆడించకపోవడాన్ని తప్పుబట్టాడు. వైభవ్ సూర్యవంశీ ఒక వజ్రమని, అతని ఆత్మవిశ్వాసం దెబ్బతీయవద్దని మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశాడు.
అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు. జింబాబ్వే పర్యటనలో 15 ఏళ్ల వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్‌ను గెలుచుకున్నాడు. కానీ సంజూ శాంసన్ జట్టులోకి తిరిగి రావడంతో అఫ్గాన్‌తో సిరీస్‌లో సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అద్వితీయమైన ప్రదర్శనతో ఈ సిరీస్‌ను భారత్ 3-0తో గెలుచుకుంది.
ఓపెనర్లను రొటేట్ చేయాలి..
తాజాగా వైభవ్‌ను పక్కనపెట్టడంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్.. మేనేజ్‌మెంట్‌కు పలు సూచనలు చేశాడు. బౌలర్ల తరహాలోనే ఓపెనర్లకు కూడా రొటేషన్ పాలసీ వర్తింపజేయాలని సలహా ఇచ్చాడు. 'సంజూ శాంసన్ అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ తలా రెండు మ్యాచ్‌లు ఆడి ఉండాల్సింది. లేదా సూర్యను మూడు మ్యాచ్‌ల్లో ఆడించి మిగతా ఇద్దర్ని రొటేట్ చేయాల్సింది.

ఇలా చేసి ఉంటే ఇండియా కండిషన్స్‌లో ఆడేందుకు సూర్యవంశీకి మరింత ఆత్మవిశ్వాసం లభించి ఉండేది. కానీ అలా చేయకుండా అతన్ని పక్కన పెట్టారు. సులువైన సిరీస్‌ల్లో కొత్త ఆటగాళ్లకు ఎప్పుడూ అవకాశం ఇవ్వాలి. రొటేషన్ పద్దతిని అనుసరించడం ద్వారా ప్రతి ఆటగాడి సామర్థ్యాన్ని మనం తెలుసుకోవచ్చు.
వరల్డ్ క్లాస్ ప్లేయర్‌గా తీర్చిదిద్దాలి..
సూర్యవంశీకి నిలకడగా ఆడే అవకాశం లభించి ఉండేది. కానీ ఇప్పుడు అతను తదుపరి సిరీస్ ఆడినప్పుడు వైభవ్ మనసులో చాలా సందేహాలు మొదలవుతాయి. అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతినివ్వడం ద్వారా టీమ్‌మేనేజ్‌మెంట్ ఒక నియమాన్ని పాటించింది. ఈ ముగ్గురు ఓపెనర్లకు కూడా అదే నిబంధన వర్తింపజేసి, వారిలోప్రతీ ఒక్కరినీ రెండు మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతించి ఉండాల్సింది. ఈ సిరీస్‌లో అభిషేక్ శర్మ 229 పరుగులతో, సంజూ శాంసన్ 117 పరుగులతో అగ్రస్థానంలో నిలిచారు.
వైభవ్ సూర్యవంశీని తీర్చిదిద్దడం చాలా ముఖ్యం. అతను సానపెట్టని వజ్రం. అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, ప్రపంచస్థాయి ఆటగాడిగా తీర్చిదిద్దం క్రికెట్‌కు చాలా అవసరం. అతని ద్వారానే ప్రపంచ క్రికెట్ పునరుజ్జీవనం సాధ్యమవుతుంది.'అని క్రిష్ శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


