అందుకే వైభవ్ సూర్యవంశీని ఆడించలేదు: గౌతమ్ గంభీర్
సంజూ శాంసన్ కోసమే టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని ఆడించలేదని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ప్రపంచకప్ విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించాలనుకున్నామని, వైభవ్ అవకాశం కోసం వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశాడు.
అఫ్గానిస్థాన్‌తో ఢిల్లీ వేదికగా జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వలేదు. దాంతో వైభవ్‌ను ఎందుకు ఆడించలేదనే ప్రశ్నలు వచ్చాయి. జింబాబ్వే పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన వైభవ్‌ను ఆడించకపోవడం ఏంటని పలువురు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు నిలదీసారు.
సంజూను పక్కన పెట్టలేను..
గురువారం మూడో టీ20 విజయానంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్.. ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అలాగే ఇంగ్లండ్ పర్యటనలో సంజూ శాంసన్‌కు బదులు వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించడం తన కోచింగ్ కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన నిర్ణయమని చెప్పుకొచ్చాడు.

'సంజూ శాంసన్ సత్తా ఏంటో అందరికి తెలిసిందే. ప్రతిభ లేకుండా ఎవరూ ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలవలేరు. అతను జట్టుకు కావాల్సింది చేశాడు. అందుకే అతన్ని పక్కనపెట్టడమనేది నా కెరీర్‌లోనే అత్యంత కఠినమైన నిర్ణయం. ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడించలేకపోయా. కానీ కొన్నిసార్లు ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
వైభవ్ వేచి చూడాల్సిందే..
నా దృష్టిలో ప్రపంచకప్ కాంబినేషన్‌నే కొనసాగిస్తే మంచిదనిపించింది. ఏదో మూడు, నాలుగు సార్లు విఫలమైనంత మాత్రాన వారు చెత్త ఆటగాళ్లుగా మారిపోరు. ప్రపంచకప్ నుంచి మరో ప్రపంచకప్ వరకు అజేయంగా నిలిచి, టైటిల్ గెలిచిన జట్టు అది. కేవలం ఒక సిరీస్ ఫలితం ఆధారంగా జట్టును తక్కువ అంచనా వేయలేం.
వైభవ్ సూర్యవంశీ విషయంలో మేం స్పష్టతతోనే ఉన్నాం. అతను అవకాశం కోసం వేచి చూడాలి. అతని టాలెంట్ ఏంటో మాకు తెలుసు. అయితే.. జట్టులో కొత్తగా చేరిన వారి కంటే.. గత కొన్నేళ్లుగా జట్టు తరఫున అద్భుతంగా ఆడుతున్న వారికే మేం ప్రాధాన్యత ఇస్తాం. అవకాశం కల్పించిన ఆటగాళ్లకు జట్టులో కొనసాగేందుకు తగినంత సమయం కూడా ఇవ్వాలి. భారత క్రికెట్‌లో పోటీతత్వం ఉండాలి. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతిభావంతులు ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటాం. 15 ఏళ్ల కుర్రాడైనా.. 30 ఏళ్ల ఆటగాడైనా అవకాశం కోసం వేచి చూడాలి.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
అభిషేక్ విధ్వంసం..
అభిషేక్ శర్మ(34 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 108) విధ్వంసకర శతకంతో ఆఖరి టీ20లో భారత్ 127 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 221 పరుగులు చేసింది. సంజూ శాంసన్(35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్(2/37) రెండేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం అఫ్గానిస్థాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ ఇబ్రహీం జడ్రాన్(16 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 25) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి(3/25), రవి బిష్ణోయ్(3/26) మూడేసి వికెట్లతో అఫ్గాన్ పతనాన్ని శాసించారు. జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్‌కు చెరో వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


