వైభవ్‌ను ఎందుకు పక్కన పెట్టారని నా పెళ్లాం కూడా ప్రశ్నించింది: క్రిష్ శ్రీకాంత్
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడాన్నితప్పుబట్టాడు. వైభవ్ ఆడటం లేదని తెలియగానే మ్యాచ్ చూడటం ఆపేసి.. సినిమా చూశానని వెల్లడించాడు. తన సతీమణి కూడా వైభవ్‌ను ఎందుకు ఆడించడం లేదని ప్రశ్నించిందన్నాడు.
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి బదులు సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా ఆడించగా.. అతను తీవ్రంగా నిరాశపర్చాడు. 8 బంతుల్లో 10 పరుగులే చేసి వెనుదిరిగాడు. దాంతో మేనేజ్‌మెంట్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జింబాబ్వే పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన వైభవ్ సూర్యవంశీ.. 196.10 స్ట్రైక్‌రేట్‌తో 151 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయినా టీమ్‌మేనేజ్‌మెంట్ వైభవ్‌ను కాకుండా సంజూ శాంసన్ ఓపెనర్‌గా ఆడించింది.

తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్.. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. వైభవ్ సూర్యవంశీకి వరుసగా అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. 'నిన్న వైభవ్ సూర్యవంశీ ఆడకపోవడంతో మేం మ్యాచ్ చూడటం ఆపేసి సినిమా చూశాం. గత మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో సిరీస్ అవార్డ్ గెలుచుకున్న వ్యక్తిని జట్టు నుంచి ఎలా తప్పిస్తారని నా భార్య అడిగింది. వైభవ్ తప్పించడాన్నినా సతీమణే ప్రశ్నిస్తోంది. వైభవ్ సూర్యవంశీని మీరు సరిగ్గా చూడలేదు. ఒకవేళ అతను తర్వాతి మ్యాచ్‌లో ఆడినా.. పరుగులు చేయకపోతే.. జట్టు నుంచి తప్పిస్తారనే భయంతో ఆడాల్సి ఉంటుంది.
టీమిండియా మేనేజ్‌మెంట్ సంజూ శాంసన్‌ను ఆడిస్తోంది. నాకు శాంసన్‌ను చూస్తే జాలిగా ఉంది. అతనికి అవకాశాలు ఇస్తూ.. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీని ఆడిస్తున్నారు. ఇద్దరికీ సరైన అవకాశాలు ఇవ్వడం లేదు. ఇది చాలా పెద్ద తప్పు. వారి భవిష్యత్తుకు ఇది ఏ మాత్రం మంచిది కాదు.'అని క్రిష్ శ్రీకాంత్ అన్నాడు. భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్ మంగళవారం ఢిల్లీ వేదికగానే జరగనుంది. సంజూ శాంసన్ కొనసాగిస్తారా?లేక వైభవ్ సూర్యవంశీని ఆడిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. టీమ్ మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


