Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vaibhav Sooryavanshi: బుడ్డోడా మజాకా.. 57 ఏళ్ల రికార్డ్ బద్దలు!

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.. అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ బాదిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.

Vaibhav Sooryavanshi: బుడ్డోడు కాదు.. మనసున్నోడు!

Vaibhav Sooryavanshi: బుడ్డోడు కాదు.. మనసున్నోడు!

దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీ.. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 15 ఏళ్ల 175 రోజుల వయసులో వైభవ్ ఈ ఘనత సాధించి 57 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 1969లో లక్ష్మణ్ సింగ్ 16 ఏళ్ల 23 రోజుల వయసులో దులీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ బాదగా.. ఆ రికార్డ్‌ను తాజాగా వైభవ్ సూర్యవంశీ అధిగమించాడు.

Vaibhav Sooryavanshi Breaks 57-Year-Old Record With Historic Fifty in Duleep Trophy 2026

దులీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ బాదిన యంగెస్ట్ బ్యాటర్లు..

వైభవ్ సూర్యవంశీ: 15 సంవత్సరాల 175 రోజులు (2026)

లక్ష్మణ్ సింగ్: 16 సంవత్సరాల 23 రోజులు (1969)

పీయూష్ చావ్లా: 16 సంవత్సరాల 307 రోజులు (2005)

చేజారిన శతకం..

బెంగళూరులోని బీసీసీఐ సీఓఈ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ..వన్డే తరహా బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫార్మాట్ ఏదైనా డోంట్ కేర్ అన్నట్లు చెలరేగాడు. కానీ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. 81 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 92 పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

సెంచరీ చేజారినా.. తన ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను తలపించాడు. తనకే సాధ్యమైన భారీ సిక్సర్లతో అలరించాడు. ఇదే తరహా దూకుడు కనబరిస్తే అతి త్వరలోనే వైభవ్ ఓపెనర్‌గా టెస్ట్ టీమ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

టెస్ట్‌ల్లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 7 సిక్స్‌లతో వీరవిహారం!

Also Read

టెస్ట్‌ల్లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 7 సిక్స్‌లతో వీరవిహారం!

ఈస్ట్ జోన్ 266 ఆలౌట్..

అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి తొలి వికెట్‌కు వైభవ్ 161 పరుగులు జోడించాడు. కానీ అతను ఔటైన వెంటనే ఈస్ట్ జోన్ పేకమేడలా కుప్పకూలింది. మరో 105 పరుగులు మాత్రమే చేసి 9 వికెట్లు కోల్పోయింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ 57 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది.

అభిమన్యు ఈశ్వరన్(69) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే(4/66) నాలుగు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్, ఆర్యన్ పాండే మూడేసి వికెట్లు పడగొట్టారు.

Story first published: Monday, August 31, 2026, 16:33 [IST]
Other articles published on Aug 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+