కావాలనే బుడ్డోడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు: క్రిష్ శ్రీకాంత్
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి అవకాశాలు ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గౌతమ్ గంభీర్ సారథ్యంలోని టీమిండియా మేనేజ్‌మెంట్ తప్పుబట్టాడు. అవకాశం ఇచ్చినప్పుడల్లా అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన వైభవ్‌కుఅవకాశం ఇవ్వకపోవడం సరికాదని అభిప్రాయపడ్డాడు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీలకు రొటేషన్ పద్దతిలో అవకాశాలు ఇవ్వాలని సూచించాడు.
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి రెండు మ్యాచ్‌ల్లోనే అవకాశం కల్పించారు. మూడో టీ20లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వైభవ్.. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ కిషన్ గాయపడటంతోనే వైభవ్‌కు అవకాశం దక్కింది. చివరి రెండు టీ20లకు ఇషాన్ అందుబాటులోకి రావడంతో వైభవ్‌కు ఉద్వాసన తప్పలేదు. సిరీస్ గెలిచినా తర్వాత కూడా న్యూజిలాండ్ ఆఖరిలో టీ20లో వైభవ్‌కు అవకాశం కల్పించకపోవడంపై క్రిష్ శ్రీకాంత్ ఘాటుగా స్పందించాడు. కావాలనే వైభవ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆరోపించాడు.

'వైభవ్ సూర్యవంశీకి వరుసగా అవకాశాలు ఇవ్వాలి. వైభవ్‌తో పాటు అభిషేక్, సంజూ శాంసన్‌లను రొటేషన్ పద్దతిలో ఆడించండి. మూడేసి మ్యాచ్‌ల చొప్పున ఆడిస్తామని వారికి క్లారిటీ ఇవ్వండి. అలా కాకుండా వైభవ్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టడం సరికాదు. ఐర్లాండ్ పర్యటనలోను అతన్ని ఆడించలేదు. ఆ తర్వాత భారత్‌లో బలహీనమైన వెస్టిండీస్ జట్టు కూడా అవకాశం ఇవ్వలేదు. వెస్టిండీస్ బౌలింగ్‌ను నేను కూడా ఆడగలను. అలాంటి సిరీస్‌లో వైభవ్‌ను ఆడించాల్సింది. సంజూ శాంసన్ అద్భుతంగా ఆడుతున్నాడు. టీ20 ప్రపంచకప్ గెలిపించాడు. నేను కాదనడం లేదు. కానీ వైభవ్‌కు కూడా అవకాశాలు ఇవ్వండని చెబుతున్నా.
వైభవ్‌కు అవకాశాలు ఇచ్చి ప్రోత్సాహించాల్సింది పోయి అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో వైభవ్‌ను ఎందుకు ఆడించలేదో టీమ్ మేనేజ్‌మెంట్ సమాధానం చెప్పాలి. న్యూజిలాండ్ పర్యటనలోనూ వైభవ్, అభిషేక్‌ను ఓపెనర్లుగా బరిలోకి దించితే ప్రత్యర్థి బౌలర్లు భయపడిపోయేవారు. వైభవ్ సూర్యవంశీ అన్ని ఫార్మాట్లు ఆడగలడు. అతనికి వన్డే జట్టులో అవకాశం ఇవ్వాలి. ఆ కుర్రాడిలో అపారమైన ప్రతిభ ఉంది.'అని క్రిష్ శ్రీకాంత్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


