Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతనితో వాషింగ్టన్ సుందర్ కెరీర్ ఫినిష్: క్రిష్ శ్రీకాంత్

టీమిండియా యువ ఆల్‌రౌండర్ నమన్ ధీర్‌తో సీనియర్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వైట్‌బాల్ కెరీర్ ముగిసినట్లేనని దిగ్గజ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ అన్నాడు. వచ్చిన అవకాశాన్ని నమన్ ధీర్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడని కొనియాడాడు. తరుచూ గాయాల బారిన పడే వాషింగ్టన్ సుందర్ ఇక నుంచి టెస్ట్‌లకు మాత్రమే పరిమితమవుతాడని అభిప్రాయపడ్డాడు.

భారత మహిళల నయా కెప్టెన్‌గా స్మృతి మంధాన..!

భారత మహిళల నయా కెప్టెన్‌గా స్మృతి మంధాన..!

వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడిన నమన్ ధీర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. చివరి నిమిషంలో టీ20 జట్టులోకి వచ్చిన నమన్ ధీర్ తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. టెస్ట్ ప్రిపరేషన్స్ కోసం టీ20ల నుంచి వాషింగ్టన్ సుందర్‌ను తప్పించి రంజీ క్రికెట్ ఆడాలని సెలెక్టర్లు ఆదేశించారు.

Kris Srikkanth Makes Big Claim on Naman Dhir Says He Has Ended Washington Sundar s White-Ball Career

సుందర్ దారులు మూసేసాడు..

సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన నమన్ ధీర్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోనూ సుందర్‌కు అవకాశం దక్కలేదు. నమన్ ధీర్‌నే ఎంపిక చేశారు. తాజాగా నమన్ ధీర్ ప్రదర్శనపై యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'వాషింగ్టన్ సుందర్‌కు రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా నమన్ ధీర్ జట్టులోకి వచ్చాడు. ప్రతీ రెండు మ్యాచ్‌లకు గాయపడటం వాషింగ్టన్ సుందర్‌కు అలవాటైపోయింది.

ఇప్పుడు అతని స్థానంలో వచ్చిన నమన్ ధీర్.. ఆరంభ మ్యాచ్‌ల్లోనే అదరగొట్టాడు. అద్వితీయమైన ప్రదర్శనతో సుందర్ దారులను మూసేశాడు. జట్టు నుంచి తప్పించలేని పరిస్థితిని కల్పించాడు. ఇప్పుడు అతన్ని పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పించలేరు. నమన్ ధీర్ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఇకపై వాషింగ్టన్ సుందర్ కేవలం టెస్ట్ క్రికెట్‌లో మాత్రమే భారత్ తరఫున ఆడగలడు'అని క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

IND vs WI: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. తొలి కెప్టెన్‌గా రికార్డ్!

Also Read

IND vs WI: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. తొలి కెప్టెన్‌గా రికార్డ్!

మంగళవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. శ్రేయస్ అయ్యర్(43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 నాటౌట్)అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. నమన్ ధీర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

Story first published: Wednesday, October 7, 2026, 18:27 [IST]
Other articles published on Oct 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+