ఇంగ్లండ్‌తో తొలి రెండు టీ20లకు వైభవ్ సూర్యవంశీ వద్దు: మాజీ సెలెక్టర్
ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. బుధవారం నాటింగ్‌హామ్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.
ఈ కీలక సిరీస్ గురించి భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడాడు. తొలి రెండు టీ20ల కోసం భారత తుది జట్టును అంచనా వేసాడు. అయితే ఈ జట్టులో టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి శ్రీకాంత్ చోటు కల్పించలేదు.
ఐర్లాండ్‌పైనే ఆడించాల్సింది..
ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లను ఎంపిక చేశారు. వైభవ్‌ను పక్కన పెట్టడంపై శ్రీకాంత్ మాట్లాడుతూ.. 'ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లోనే వైభవ్ సూర్యవంశీ 100 శాతం ఆడాల్సింది. తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు విశ్రాంతినిచ్చి.. వైభవ్‌కు అవకాశం ఇవ్వాల్సింది.

ఐపీఎల్‌లో కష్టమైన పరిస్థితుల్లో రాణించిన వైభవ్, బహుశా ఆ మ్యాచ్ గెలిపించేవాడేమో. కానీ అక్కడ అవకాశం ఇవ్వనందున, ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టీ20ల్లో అతన్ని నేరుగా తుది జట్టులోకి తీసుకోలేం'అని స్పష్టం చేశారు.
ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం
ఇటీవల ముగిసిన ఐర్లాండ్ సిరీస్‌లో భారత ఓపెనర్లు ఘోరంగా విఫలమయ్యారు. తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 49 పరుగులు చేయగా.. సంజూ శాంసన్ డకౌట్ అయ్యాడు. ఇక రెండో టీ20లో ఇద్దరూ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగారు. తొలి మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్య ఛేదనలో 34 పరుగుల తేడాతో ఓడిన భారత్, రెండో మ్యాచ్‌లో కేవలం ఒక పరుగు తేడాతో పరాజయం పాలైంది. ఐర్లాండ్ చేతిలో భారత్‌కు ఇదే తొలి సిరీస్ ఓటమి.
శ్రీకాంత్ ఎంపిక చేసిన భారత తుది జట్టు:
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్.
భారత్-ఇంగ్లండ్ టీ20 షెడ్యూల్:
మొదటి టీ20: జూలై 1 (చీస్టర్-లీ-స్ట్రీట్)
రెండో టీ20: జూలై 4 (మాంచెస్టర్)
మూడో టీ20: జూలై 7 (నాటింగ్‌హామ్)
ఐదో టీ20: జూలై 11 (సౌతాంప్టన్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

