Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనే వైభవ్ సూర్యవంశీని ఆడించాలి: సునీల్ గవాస్కర్

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని వెంటనే తుది జట్టులోకి తీసుకోవాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే ఆడించాలని చెప్పాడు. ఐర్లాండ్‌తో సిరీస్‌లో అతన్ని ఆడించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి ఆడే అవకాశం దక్కలేదు. దాంతో అతన్ని ఎందుకు ఆడించలేదనే ప్రశ్నలు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఎదురయ్యాయి. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యారు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీని కనీసం రెండో టీ20లో ఆడించినా బాగుండేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.

IND vs IRE: ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం!

IND vs IRE: ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం!

వైభవ్ ఒక్కడే గెలిపిస్తాడని కాదు..

తాజాగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనైనా వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని సూచించాడు. 'నెల రోజుల క్రితమే ఓ కార్యక్రమంలో వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పా. ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌లు ఆడుతాడని అనుకున్నా. ఎందుకంటే అతని ఫామ్‌ ఆ స్థాయిలో ఉంది. కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఆడిస్తారని ఆశించాం. కానీ అలా జరగలేదు.

Sunil Gavaskar Demands T20I Debut for Teenage Prodigy Vaibhav Sooryavanshi in England Series at All Costs

వైభవ్ ఒక్కడే మ్యాచ్‌ను గెలిపిస్తాడని నేను చెప్పడం లేదు. అతను కూడా 10-15 పరుగులకు విఫలమయ్యేవాడేమో. కానీ వైభవ్‌కు అవకాశం ఇస్తే బాగుండేది. ఈ రెండు మ్యాచ్‌లు అతని కెరీర్‌కు మంచి ఛాన్స్. ఇప్పుడిది ముగిసింది. కనీసం అతన్ని ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ల్లోనైనా ఆడించాలి. మరీ ఎక్కువ కాలం వైభవ్‌ను పక్కనపెట్టొద్దు. తప్పకుండా తొలి మ్యాచ్‌లోనే ఆడించాలి.

ఆ ఇద్దరు విఫలమయ్యారు కదా..?

ఫామ్‌లో లేని ఆటగాళ్లను బెంచ్‌పై కూర్చోబెట్టి.. వైభవ్‌కు ఛాన్స్ ఇవ్వాలి. ఓపెనర్‌గా ఆడిస్తారా? ఫస్ట్ డౌన్‌లో ఆడిస్తారా? అనేది టీమ్ మేనేజ్‌మెంట్ ఇష్టం. కానీ, ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతను తొలి మ్యాచ్ ఆడాల్సిందే.

అతని కోసమే వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వలేదు: టీమిండియా కోచ్

అతని కోసమే వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వలేదు: టీమిండియా కోచ్

ఐర్లాండ్‌తో సిరీస్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ బాగా ఆడి ఉంటే తప్పించడం కష్టమయ్యేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉంది. కనీసం మిడిలార్డర్‌లోనైనా ఒకర్ని మినహాయించి వైభవ్‌కు చోటు కల్పించాలి.'అని సునీల్ గవాస్కర్ సూచించాడు. మరోవైపు సంజూ శాంసన్ కోసమే వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకోలేదని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తెలిపాడు. ఇతర అరంగేట్ర ఆటగాళ్లలా వైభవ్ ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందేనని అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, June 29, 2026, 16:21 [IST]
Other articles published on Jun 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+