Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK శివమ్ దూబేను ఫ్రీగా వదిలేసి అతన్ని తీసుకోవాలి: క్రిష్ శ్రీకాంత్

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌(సీఎస్‌కే)తో పాటు ముంబై ఇండియన్స్ జట్లకు మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిష్ శ్రీకాంత్ కీలక సలహా ఇచ్చాడు. హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవాలని సీఎస్‌కే‌కు సూచించిన క్రిష్ శ్రీకాంత్.. ముంబై ఇండియన్స్ తమ సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మ లేదా సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించాలన్నాడు.

సీఎస్‌కేలోని శివమ్ దూబేను ఫ్రీగా వదిలేసిని జట్టుకు వచ్చే నష్టం ఏం లేదన్నాడు. హార్దిక్ పాండ్యా కోసం శివమ్ దూబే, ఆయుష్ మాత్రేలను వదులుకున్నా ఏం కాదని చెప్పాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యాను వదులుకోవడమే ముంబై ఇండియన్స్‌కు ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్ తమ హెడ్ కోచ్‌గా చంద్రకాంత్ పండిట్‌ను నియమించుకోవాలని సూచించాడు.

IND vs NZ: వైభవ్‌ సూర్యవంశీని జట్టు నుంచి తప్పించండి: ఆకాష్ చోప్రా

IND vs NZ: వైభవ్‌ సూర్యవంశీని జట్టు నుంచి తప్పించండి: ఆకాష్ చోప్రా

శివమ్ దూబేను ఫ్రీగా వదిలేస్తా..

'ఐపీఎల్ టీమ్ మారడం హార్దిక్ పాండ్యాతో పాటు ముంబై ఇండియన్స్‌కు మంచిది. అతని కెప్టెన్సీలో ముంబై జట్టు కాంబినేషన్‌ సరిగ్గా లేక, పేలవ ప్రదర్శన కనబర్చింది. ఒకవేళ హార్దిక్ పాండ్యా సీఎస్‌కేలోకి వస్తే ఆ జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది.

ఎందుకుంటే వాళ్లకు ఆల్‌రౌండ్ స్లాట్ పక్కాగా సెట్ అవుతుంది. నేనే గనుక సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌లో ఉంటే శివమ్ దూబేను ఉచితంగా ఇచ్చేవాడిని. అతనికి బదులుగా ఏ ఆటగాళ్లను కూడా అడిగేవాడిని కాదు. అవసరమైతే దూబేను వేలంలోకి వదిలేసి మళ్లీ కొనుక్కునే ప్రయత్నం చేసేవాడిని.

Kris Srikkanth Brutal Advice to CSK I Would Give Shivam Dube Away for Free ahead of IPL 2027 auction

హార్దిక్ పాండ్యా వంటి ఆటగాడి కోసం శివమ్ దూబేతో పాటు ఆయుష్ మాత్రేను వదులుకోవడానికి కూడా నేను వెనుకాడను. ఇప్పటికే సీఎస్‌కే బ్యాటింగ్‌ లైనప్ బలంగా ఉంది. కాబట్టి ఈ ఇద్దర్నీ ఇచ్చేసి హార్దిక్ పాండ్యాను తీసుకుంటే వాళ్ల టాప్-5 బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలంగా తయారవుతుంది.

ముంబై కోచ్‌గా అతను కరెక్ట్..

నేను ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌లో ఉండి ఉంటే చంద్రకాంత్‌ పండిట్‌ను హెడ్ కోచ్‌గా నియమించేవాడిని. ఆయన ముంబైకి చెందిన లోకల్ కోచ్ మాత్రమే కాకుండా దేశవాళీలో ఆ జట్టు తరఫున చాలా క్రికెట్ ఆడారు. ఆయన రాక ముంబైకి పెద్ద ఆస్థి అవుతుంది. ముంబై జట్టుకు చంద్రకాంత్ పండిట్ వంటి కోచ్ అవసరం ఉంది. ఆయన ఆటను బాగా అర్థం చేసుకునే వ్యక్తి. అనవసరంగా హడావుడి చేయకుండా ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతారు.

వైభవ్ సూర్యవంశీ కెరీర్‌ను నాశనం చేస్తున్నారు: మాజీ ఛీప్ సెలెక్టర్

Also Read

వైభవ్ సూర్యవంశీ కెరీర్‌ను నాశనం చేస్తున్నారు: మాజీ ఛీప్ సెలెక్టర్

ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మ లేదా సూర్యకుమార్ యాదవ్‌లో ఒకరికి ఇవ్వవచ్చు. చంద్రకాంత్ పండిట్ కోచ్‌గా ఉంటూ.. రోహిత్, సూర్యలో ఒకరు కెప్టెన్‌గా ఉంటే ముంబై కాంబినేషన్ సెట్ అవుతుంది. రోహిత్ సారథ్యం వహిస్తే జట్టులో మళ్లీ ఆ ఐక్యత వస్తుంది. వచ్చే ఏడాది మెగా వేలానికి ముందు ముంబైని బలంగా తీర్చిదిద్దడానికి రోహిత్ శర్మ బాగా ఉపయోగపడుతాడు.'క్రిష్ శ్రీకాంత్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, October 20, 2026, 19:29 [IST]
Other articles published on Oct 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+