Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీ కెరీర్‌ను నాశనం చేస్తున్నారు: మాజీ ఛీప్ సెలెక్టర్

అవకాశాలు ఇవ్వకుండా టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కెరీర్‌ను నాశనం చేస్తున్నారని 1983 ప్రపంచకప్ విన్నర్, మాజీ సెలెక్టర్ క్రిష్ శ్రీకాంత్ అన్నాడు. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా వైభవ్ సూర్యవంశీని బెంచ్‌కు పరిమితం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరగ్గా భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది.

అయితే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లను ఓపెనర్లుగా ఆడించడంతో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కలేదు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం సంజూ శాంసన్‌ను తప్పించలేమని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే స్పష్టం చేశాడు. వైభవ్ అవకాశం కోసం వేచి చూడాల్సిందేనని అభిప్రాయపడ్డాడు.

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

వైభవ్ ఫామ్‌లో ఉన్నా..

ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్వితీయమైన ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చిన వైభవ్.. ఇంగ్లండ్ పర్యటనలో అరంగేట్రం చేశాడు. ఆ టూర్‌లో విఫలమైనా.. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ అందుకున్నాడు.

K Srikkanth Slams India Over Vaibhav Sooryavanshi s Handling Wants Abhishek Sharma Dropped

ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో అతనికి ఒక్క అవకాశం దక్కలేదు. జపాన్‌తో ఏకైక టీ20లోనూ ఆడించలేదు. ఆసియా గేమ్స్‌లో శ్రీలంకతో సెమీస్, పాకిస్థాన్‌తో ఫైనల్ ఆడిన వైభవ్.. అదిరిపోయే ఆరంభాలను అందించాడు. కానీ వెస్టిండీస్‌తో సిరీస్‌లో మళ్లీ అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు.

కెరీర్ నాశనం చేస్తున్నారు..

తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడిన శ్రీకాంత్.. టీమిండియా మేనేజ్‌మెంట్ అతని కెరీర్‌ను నాశనం చేస్తుందని మండిపడ్డాడు. కనీసం నాలుగు, ఐదో టీ20లోనైనా అతనికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వరుసగా ఆడుతున్న అభిషేక్ శర్మ‌కు రెస్ట్ ఇచ్చి మరీ వైభవ్‌ను ఆడించాలని సూచించాడు.

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

Also Read

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

'వైభవ్ సూర్యవంశీ కెరీర్‌ను భారత జట్టు నాశనం చేస్తుంది. వెస్టిండీస్ వంటి మాములు జట్టు మీద కూడా అతని అవకాశం ఇవ్వడం లేదు. కనీసం మూడు మ్యాచ్‌ల్లో అయినా అవకాశం ఇవ్వాల్సింది. ఇప్పటికే అభిషేక్ శర్మకు చాలా అవకాశాలు ఇచ్చారు. కాబట్టి తదుపరి మ్యాచ్‌లో అతనికి కాస్త రెస్ట్ ఇచ్చి వైభవ్‌ను ఆడించాలి. సంజూ శాంసన్‌తో కలిసి ఓపెనింగ్ చేయిస్తే బాగుంటుంది.

సంజూలో నిలకడలేదు..

సంజూ శాంసన్ నిలకడగా రాణించలేడు. అతని బ్యాటింగ్‌లో స్థిరత్వం అనేది ప్రశ్నార్థకమే. సడన్‌గా ప్రపంచకప్‌లో అద్భుతంగా చెలరేగుతాడు. మళ్లీ అంతే సడన్‌గా వరుస వైఫల్యాలను ఎదుర్కొంటాడు.కానీ అభిషేక్ శర్మ అలా కాదు. అతని బ్యాటింగ్ గ్రాఫ్ మరీ అంత ఎత్తు పల్లాలుగా ఉండదు. అయినా సరే సంజూ శాంసన్ తదుపరి మ్యాచ్‌లో కచ్చితంగా పరుగులు చేస్తాడు.'అని క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, October 14, 2026, 9:41 [IST]
Other articles published on Oct 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+