ఆ తెలుగోడి స్వార్థం వల్లే ఐర్లాండ్ చేతిలో టీమిండియాకు ఓటమి: క్రిష్ శ్రీకాంత్
ఐర్లాండ్‌తో రెండో టీ20లో టీమిండియా ఓటమికి తెలుగు తేజం తిలక్ వర్మనే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ అన్నాడు. తిలక్ వర్మ జట్టు విజయం కోసం కాకుండా తన కోసం ఆడాడని విమర్శలు గుప్పించాడు. మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లి మ్యాచ్‌ను గెలిపించి హీరో అవ్వాలనుకున్నాడని, కానీ ప్లాన్ బెడిసి కొట్టడంతో జీరో అయ్యాడని తెలిపాడు.
ఐర్లాండ్‌తో రెండో టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ(46 బంతుల్లో 55) హాఫ్ సెంచరీతో రాణించాడు. కానీ వికెట్‌ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో స్లోగా ఆడాడు. దాంతో మిడిల్ ఓవర్లలో 45 బంతుల్లో ఒక్క బౌండరీ రాలేదు. ఇదే విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ప్రస్తావించిన క్రిష్ శ్రీకాంత్.. తిలక్ వర్మ ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు.

తిలక్ వర్మ స్వార్థం..
'తిలక్ వర్మ తన కోసం మాత్రమే ఆడాడు. మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లి జట్టును గెలిపించి హీరో అవ్వాలనుకున్నాడు. తన జెర్సీ తీసేసి సెలెబ్రేట్ చేసుకోవాలని భావించాడు. అయితే ఈ లక్ష్యాలను మరో ఓవర్ మిగిలి ఉండగానే పూర్తి చేయాలే తప్పా ఆఖరి వరకు తీసుకెళ్లకూడదు. మిడిల్ ఓవర్లలోనే అటాక్ చేయాలి.
భారత్ మిడిల్ ఫేస్ బ్యాటింగ్ ఏ మాత్రం బాలేదు. ముఖ్యంగా తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్ స్ట్రైక్‌రేట్స్ మరి దారుణంగా ఉన్నాయి. మిడిల్ ఫేస్‌లో దూకుడుగా ఆడకపోవడం వల్లే ఇండియా ఓడిపోయింది. తిలక్ వర్మ సింగిల్స్, టూస్ తీస్తూ తన కోసమే ఆడాడు. అక్షర్ పటేల్ కూడా అలానే ఆడాడు.
45 బంతుల్లో ఒక్క బౌండరీ రాలేదు..
మిడిల్ ఓవర్లలో 45 బంతుల్లో ఒక్క బౌండరీ రాలేదు. ఇలా ఆడితే టీ20 మ్యాచ్ గెలుస్తారా? ఒక మాదిరి ఐర్లాండ్ బౌలింగ్.. భారత బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీయడం సిగ్గు చేటు. ఐపీఎల్‌లో కూడా ఈ టాప్ భారత ఆటగాళ్లు.. లక్నో వేదికగా ఎన్ని పరుగులు చేశారు? ఎందుకంటే లక్నో వికెట్ కూడా స్వింగ్, సీమ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అతికొద్ది ఇండియన్ బ్యాటర్లు మాత్రమే లక్నోలో పరుగులు చేశారు. మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లకుండా మిడిల్ ఓవర్లలోనే భారత్ అటాక్ చేయాల్సింది.'అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

