సచిన్ దరిదాపుల్లోకి కూడా రాలేడు: మాజీ కెప్టెన్ ఫైర్!
టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించారు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే టీమిండియా టీ20 జట్టులోకి ఎంపికై అరంగేట్రానికి సిద్ధంగా ఉన్న ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో పోల్చడంపై క్రిస్ శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వైభవ్ గనుక అంతర్జాతీయ జట్టులో అడుగుపెడితే.. అత్యంత పిన్న వయసులో భారత్ తరఫున ఆడిన సచిన్ రికార్డు బద్ధలవుతుంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య పోలికలు వస్తుండగా.. శ్రీకాంత్ ఆసక్తికర కామెంట్లు చేశారు.
వేర్వేరు తరాలకు చెందిన ఆటగాళ్లను పోల్చడం సరికాదని.. సచిన్, వైభవ్ మధ్య పోలికల గురించి వస్తున్న చర్చలకు స్వస్తి చెప్పాలని శ్రీకాంత్ కోరారు. "సచిన్‌ను, సూర్యవంశీని అస్సలు పోల్చవద్దు. సచిన్ టెండూల్కర్ ఎప్పటికీ 'క్రికెట్ దేవుడు'. ఇక ఈ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని నేను 'దేవుడి కుమారుడు'అని పిలుస్తాను. సచిన్ స్థానం సచిన్‌దే, ఆయనకు దరిదాపుల్లోకి ఎవరూ రాలేరు. అందుకే ఈ ఇద్దరి మధ్య పోలిక అనవసరం" అని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

ఐపీఎల్‌లో, అండర్-19 ఫార్మాట్లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన అసాధారణమైనదని క్రిస్ శ్రీకాంత్ కొనియాడారు. ఈ రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ షాట్లు ఆడే విధానం, అతని రిస్ట్ స్పీడ్, బ్యాట్ స్వింగ్ అద్భుతమని పేర్కొన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వయసులోనే వైభవ్ చాలా పరిణతి చెందిన మనస్తత్వంతో బ్యాటింగ్ చేస్తున్నాడని ప్రశంసించారు.ఐపీఎల్ క్వాలిఫైయర్స్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఒత్తిడి సమయంలో వైభవ్ ఆడిన 96 పరుగుల ఇన్నింగ్స్‌ను ఆయన గుర్తుచేశారు. బౌలర్లపై ఆధిపత్యం చలాయించడంతో పాటు క్రీజులో నిలబడి ఇన్నింగ్స్ నిర్మించే ఆకలి ఈ కుర్రాడిలో ఉందని అభినందించారు.
66 ఏళ్ల మాజీ ఓపెనర్ శ్రీకాంత్.. వైభవ్ సూర్యవంశీకి అత్యంత ఉజ్వల భవిష్యత్తు ఉందని జోస్యం చెప్పారు. అందువల్ల ఈ టీనేజర్‌ను ఎవరితోనూ పోల్చకుండా, అతని శైలిలో అతడిని సహజంగా ఎదగనివ్వాలని సూచించారు. సచిన్ లేదా మరే ఇతర క్రికెటర్‌తో పోల్చి అతనిపై ఒత్తిడి పెంచకుండా, ఒక దేశంగా మనం ఆ అబ్బాయిని కేవలం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని శ్రీకాంత్ తన చర్చను ముగించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications