రోహిత్.. నన్ను క్షమించు! అందుకే నిన్ను 2011 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయలేదు: శ్రీకాంత్
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ సెలెక్టర్ క్రిష్ శ్రీకాంత్ క్షమాపణలు చెప్పారు. భారత్ గెలిచిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2011 జట్టులో రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడం తనను ఇప్పటికీ వెంటాడుతుందని తెలిపారు. 1983 వన్డే ప్రపంచకప్ జట్టు తరహాలో పార్ట్‌టైమ్ బౌలర్లకు ప్రాధానత్య ఇచ్చే క్రమంలో రోహిత్ శర్మను పక్కన పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
వన్డే ప్రపంచకప్ 2011 ఆడే సామర్థ్యం రోహిత్ శర్మకు ఉందని, కానీ జట్టు అవసరాల కోసం అతన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో శ్రీకాంత్ సెలెక్టర్‌గా ఉన్నారు. అయితే తన కెరీర్‌లో లోటు ఏదైనా ఉందా? అంటే అది చివరి నిమిషంలో 2011 వన్డే ప్రపంచకప్‌కు దూరం కావడమేనని చాలా ఇంటర్వ్యూల్లో రోహిత్ శర్మ తెలిపాడు.
రోహిత్‌కు సారీ చెప్పా..
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఈ వ్యవహారంపై మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్.. రోహిత్ శర్మకు క్షమాపణలు చెప్పారు. 'ప్రతి ఇంటర్వ్యూలోనూ రోహిత్ శర్మ 2011 వరల్డ్ కప్ మిస్ అయ్యానని చెబుతుంటాడు. అది విన్నప్పుడల్లా నాకు ఇప్పటికీ అతని గురించి బాధగా అనిపిస్తుంది. గత ఏడాది నేను రోహిత్‌తో.. 'సారీ బాస్, అది కావాలని చేసింది కాదు. కానీ మాకు అప్పుడు కొంతమంది పార్ట్ టైమ్ బౌలర్లు అవసరమయ్యారు.

మా ఆలోచనా విధానం 1983 వరల్డ్ కప్ జట్టు లాగే ఉంది. చివరికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు? బంతి, బ్యాట్‌తో రాణించిన యువరాజ్ సింగ్. కొన్ని మ్యాచ్‌ల్లో సెహ్వాగ్, సచిన్, సురేష్ రైనా కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేశారు. యూసుఫ్ పఠాన్ కూడా హాఫ్ ఆల్‌రౌండరే' అని చెప్పాను. ఈ క్రమంలో.. దురదృష్టవశాత్తు ఆ హాఫ్ ఆల్‌రౌండర్ కాన్సెప్ట్ వల్ల రోహిత్ శర్మకి జట్టులో చోటు దక్కలేదు. పాపం. నిజానికి అతను 2011 వరల్డ్ కప్‌లో ఆడేంత ప్రతిభ ఉన్నవాడే. కానీ పాపం ఆ అవకాశం చేజారిపోయింది.' అని క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
క్రిష్ వ్యాఖ్యలపై రోహిత్ ఫ్యాన్స్ ఫైర్..
అయితే క్రిష్ శ్రీకాంత్ వివరణపై రోహిత్ శర్మ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2011 వరల్డ్ కప్ జట్టులో ఉన్న పార్ట్‌టైమ్ బౌలర్ల కంటే రోహిత్ శర్మ మెరుగైన పార్ట్ టైమ్ బౌలర్ అని గుర్తు చేస్తున్నారు. అప్పటికే ఐపీఎల్‌లో స్పిన్నర్‌గా రోహిత్ సత్తా చాటాడని, క్రిష్ శ్రీకాంత్ అసలు విషయం చెప్పకుండా కాకమ్మ కథలు చెబుతున్నాడని మండిపడుతున్నారు.
విరాట్ కోహ్లీ కోసం రోహిత్ శర్మ తప్పించారని, ఈ విషయం చెప్పకుండా సొల్లు చెప్పుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాఫ్ ఆల్‌రౌండర్ల కాన్సెప్ట్ అయితే కోహ్లీని ఎందుకు ఎంపిక చేశారని నిలదీస్తున్నారు. క్రిష్ శ్రీకాంత్‌కు అల్జిమర్స్ ఉంటే.. అభిమానులు ఏమైనా పిచ్చోల్లా? సెటైర్లు పేల్చుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications