Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతని మరణం నా ఆలోచనా దృక్పథాన్ని మార్చింది: కోహ్లీ

Kobe Bryants Death Put Everything In Perspective For Me, Says Virat Kohli

హామిల్టన్‌: బాస్కెట్‌ బాల్‌ లెజెండ్ కోబీ బ్రయాంట్‌ ఆకస్మిక మరణం తన ఆలోచనా దృక్పథాన్ని మార్చిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. అతని మరణ వార్త తనను షాక్‌కు గురిచేసిందన్నాడు. జీవితంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో ఊహించలేమని.. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలని వేదాంతం చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. కోబీకి నివాళులు అర్పించాడు.

హార్ట్ బ్రేకింగ్ న్యూస్..

హార్ట్ బ్రేకింగ్ న్యూస్..

‘కోబీ ఆకస్మిక మరణం హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఇది ప్రతీ ఒక్కరని షాక్‌కు గురిచేసింది. రోజూ ఉదయం ఎన్‌బీఏ మ్యాచ్‌లు చూడటంతో నా రోజు మొదలయ్యేది. అలా నాకు స్ఫూర్తిగా నిలిచిన కోబీ అకస్మాత్తుగా మరణించడం తీవ్ర బాధను మిగిల్చింది. నా ఆలోచనా దృక్పథాన్ని మార్చింది. అతని మరణంతో నేను జీవితాన్ని కొత్తగా చూడటం మొదలు పెట్టాను. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో తెలియదు.'అని కోహ్లీ తెలిపాడు.

అంపైర్‌ షూ తాకిన జొకోవిచ్‌‌.. రూ. 14లక్షల జరిమానా!

ఏం చేస్తున్నామనేది ముఖ్యం కాదు..

ఏం చేస్తున్నామనేది ముఖ్యం కాదు..

రోజు ఏం చేస్తున్నామనేది ముఖ్యం కాదని, ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించడమే అతి ప్రధానమైనదని ఈ రన్ మెషిన్ అభిప్రాయపడ్డాడు. ‘ కొన్నిసార్లు... మనం కేవలం ఆట గురించే ఆలోచిస్తాం. ఎలాంటి షాట్‌ ఆడాలి.. ఎలాంటి బంతిని కావాలనే ఆలోచనలతో మన జీవితాన్నే మరచిపోతాం. కోబీ మరణంతో నేను జీవితాన్ని కొత్తగా చూడటం మొదలుపెట్టాను. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్తాదిస్తున్నాను. ప్రతీ మూమెంట్ ప్రతీ ఒక్కరు ఆస్వాదించాలి. రోజులో ఏం చేస్తున్నామనేది ముఖ్యం కాదు... జీవించడమే అతి ముఖ్యమైనది' అని కోహ్లి వేదాంతం చెప్పుకొచ్చాడు.

భాకీ మార్పులు..

భాకీ మార్పులు..

ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీ మార్పులు ఉంటాయని కోహ్లీ స్పష్టం చేశాడు. రోహిత్ గాయంతో దూరమవ్వడం దురదృష్టకరమన్న కోహ్లీ.. ఇక ఈ సిరీస్‌తో ఓపెనర్‌గా యంగ్ సెన్సేషన్ పృథ్వీ షా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడని తెలిపాడు.

'ఈ సిరీస్‌తో వన్డేల్లో ఓపెనర్‌గా పృథ్వీ షా అరంగ్రేటం చేయనున్నాడు. కేఎల్‌ రాహుల్‌ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తాడు. ఎందుకంటే.. రాహుల్ మిడిల్‌లో అలవాటు పడాలని భావిస్తున్నాం. ఆసీస్ సిరీస్‌లో కూడా రాహుల్ మిడిల్‌లో బాగా ఆకట్టుకున్నాడు. పృథ్వీ షా ఎలా ఆడుతాడో చూడాలి. యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మయాంక్ అగర్వాల్‌కు కూడా మంచి అవకాశం దొరికింది' అని కోహ్లీ పేర్కొన్నారు.

రాహుల్ సూపర్ కీపింగ్‌తో ధోని డిబెట్ సైడ్ ట్రాక్.. తెరపైకి పంత్ భవితవ్యం

ఫీల్డింగ్‌లో మరింత మెరుగవ్వాలి

ఫీల్డింగ్‌లో మరింత మెరుగవ్వాలి

'మేం ఫీల్డింగ్‌లో మరింత మెరుగవ్వాలి. గత సిరీస్‌లో (కివీస్‌ టీ20) పేలవంగా ఫీల్డింగ్‌ చేసినా.. టీ20ల్లో విజయం సాధించాం. కానీ.. వన్డేల్లో అలా కుదరదు, ఫలితాలు మారుతుంటాయి. మైదానంలో చురుకుగా ఉండటానికి ప్రయత్నిస్తాం. దీనిపై మరింత దృష్టిసారించాలి. మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాం. జట్టులో కుర్రాళ్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఫీల్డింగ్‌ విషయంలో త్వరగా నేర్చుకుంటారు' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.

హెలికాప్టర్ ప్రమాదంలో..

హెలికాప్టర్ ప్రమాదంలో..

ఇక ‘బ్లాక్‌ మాంబా'గా సుపరిచితమైన బాస్కెట్‌ బాల్‌ లెజెండ్‌ కోబీ బ్రయాంట్‌, కూతురు జియానా(13) సహా మరో ఏడుగురు హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం విదితమే. గత జనవరి 26న కాలిఫోర్నియా సమీపంలోని క్యాలాబసస్‌ వద్ద జరిగిన ఈ దుర్ఘటన యావత్‌ క్రీడా ప్రపంచాన్ని దుఃఖ సాగరంలో ముంచివేసింది. క్రికెట్, టెన్నిస్, ఫుట్‌బాల్ దిగ్గజాలంతా కోబీ ఆకస్మిక మరణం పట్ల దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.

Story first published: Tuesday, February 4, 2020, 13:27 [IST]
Other articles published on Feb 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+