
చింతిస్తున్నా..
ఇక ఛైర్ అంపైర్ పాదాన్ని తాకడంపై నొవాక్ జొకోవిచ్ స్పందించాడు. అంపైర్ పాదాన్ని తాకినందుకు తానెంతో చింతిస్తున్నట్లు తెలిపాడు. అంపైర్ షూను టచ్ చేసే సమయంలో తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదన్నాడు. స్నేహపూర్వకంగానే తాకానని ఈ సెర్బీయా వీరుడు చెప్పుకొచ్చాడు.

అసలేం జరిగిందంటే..
ఫైనల్ మ్యాచ్‌లో వరుసగా రెండు సార్లు జొకోవిచ్ నిర్ణీత సమయంలో సర్వీస్ చేయకపోవడంతో అంపైర్ డామియన్ డుముసోయిస్(ఫ్రెంచ్) హెచ్చరించాడు. రెండో సెట్‌లో 4-4తో సమంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే సహనం కోల్పోయిన నొవాక్ వెంటనే సెట్ ముగిశాక తన సీటులో కూర్చొనేందుకు వెళ్తూ అంపైర్ ఛైర్ వద్దకు వచ్చి డామియన్ బూటుపై చేతితో తాకాడు. అంతేకాకుండా వెటకారంగా చూస్తూ.. ఈ మ్యాచ్‌లో నువ్వెంతో ఫేమస్ అయ్యేలా చేసుకున్నావు. గ్రేట్ జాబ్. మరీ ముఖ్యంగా రెండోది. వెల్‌డన్ మ్యాన్ అంటూ సెటైరిక్‌గా కామెంట్ చేశాడు. ఇక జొకో వ్యాఖ్యలపై అంపైర్ ఏ మాత్రం స్పందించలేదు.
శివమ్ దూబే చెత్త రికార్డు.. యువరాజ్ సిక్స్ సిక్సర్లకు బలైన స్టువర్ట్ బ్రాడ్ తర్వాత..

ఎనిమిదోసారి..
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తనకు తిరుగులేదని నిరూపిస్తూ.. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఎనిమిదోసారి ట్రోఫీ చేజిక్కించుకున్నాడు. ఇప్పటివరకు మెల్‌బోర్న్‌లో ఆడిన ఏడు ఫైనల్స్‌లోనూ గెలుపొందిన జొకో.. ఆదివారం జరిగిన తుది పోరులో 6-4, 4-6, 2-6, 6-3, 6-4తో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై విజయం సాధించాడు.


Click it and Unblock the Notifications












