Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Duleep Trophy 2026 ఫైనల్‌కు దూరం.. బీసీసీఐ ఆదేశాలను దిక్కరించిన కేఎల్ రాహుల్?

ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. ఆదివారం చెన్నై వేదికగా ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్, తిలక్ వర్మ కెప్టెన్సీలోని సౌత్ జోన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ముగిసిన నేపథ్యంలో సౌత్ జోన్ తరఫున కేఎల్ రాహుల్ దులీప్ ట్రోఫీ ఫైనల్ ఆడుతాడని అంతా అనుకున్నారు. కానీ అతను ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు కూడా దూరంగా ఉన్నాడని తెలుస్తోంది.

అతను జట్టులో ఉండటం మా అదృష్టం: ఇషాన్ కిషన్

అతను జట్టులో ఉండటం మా అదృష్టం: ఇషాన్ కిషన్

అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో బీసీసీఐ కాంట్రాక్ట్ ఆటగాళ్లంతా తప్పనిసరిగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలని బీసీసీఐ గతంలోనే ఆల్టిమేటం జారీ చేసింది. కానీ ఈ ఆదేశాలను కేఎల్ రాహుల్ దిక్కరించాడని ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ తీసుకొచ్చిన నిబంధన కారణంగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సుదీర్ఘ విరామం తర్వాత రంజీ క్రికెట్ ఆడారు. విజయ్ హజారే ట్రోఫీలో కూడా బరిలోకి దిగారు.

KL Rahul to Miss Duleep Trophy 2026 Final Despite BCCI Directive to Play Domestic Cricket

బీసీసీఐ చర్యలు తీసుకుంటుందా..?

సౌత్ జోన్ జట్టులో కేఎల్ రాహుల్‌ను చేర్చినా అతను అందుబాటులోకి రాలేదని కెప్టెన్ తిలక్ వర్మ స్పష్టం చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 పరాజయం అనంతరం కేఎల్ రాహుల్ పొట్టి ఫార్మాట్‌కు దూరమయ్యాడు. కేవలం వన్డే, టెస్ట్ ఫార్మాట్స్ మాత్రమే ఆడుతున్నాడు. 2024లో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు ఆడలేదనే కారణంతో బీసీసీఐ వారిపై చర్యలు తీసుకుంది. బీసీసీఐ ఆదేశాలను దిక్కరించినందుకు వారిని కాంట్రాక్టుల్లో నుంచి తొలగించింది.

కేఎల్ రాహుల్‌పై కూడా ఇదే తరహాలో చర్యలు తీసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. అయితే ముందస్తు అనుమతితోనే కేఎల్ రాహుల్.. ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు దూరం కావచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. కేఎల్ రాహుల్ గైర్హాజరీపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

ఆదివారం నుంచి సెప్టెంబర్ 10 వరకు దులీప్ ట్రోఫీ ఫైనల్ జరగనుండగా.. సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ దులీప్ ట్రోఫీ ఫైనల్ ఆడుతున్నప్పుడు రాహుల్‌కు ఏమైందనే ప్రశ్నలు వస్తున్నాయి.

IND vs AFG: ఆ ఇద్దరూ ఏం తప్పు చేశారు.. ఎందుకు తప్పించారు: మాజీ క్రికెటర్

Also Read

IND vs AFG: ఆ ఇద్దరూ ఏం తప్పు చేశారు.. ఎందుకు తప్పించారు: మాజీ క్రికెటర్


54 ఏళ్ల తర్వాత..

54 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ తలపడుతున్నాయి. ఈ ఇరు జట్లు దులీప్ ట్రోఫీ ఫైనల్లో తలపడటం ఇది రెండోసారి మాత్రం. చివరి సారిగా 1970-71 సీజన్‌లో ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓవరాల్‌గా సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్ చేరడం ఇది 24వ సారి.

ఇప్పటి వరకు సౌత్ జోన్ 13 టైటిళ్లు గెలిచింది. మరోవైపు 13 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన ఈస్ట్ జోన్.. చివరి సారిగా 2012-13 సీజన్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇప్పటి వరకు 8 సార్లు ఫైనల్ చేరిన ఈస్ట్ జోన్ రెండు టైటిళ్లు మాత్రమే గెలిచింది.

Story first published: Saturday, September 5, 2026, 18:20 [IST]
Other articles published on Sep 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+