మా ఆటగాళ్లకు సిగ్గు, అహంభావం లేదు: కేఎల్ రాహుల్
నేర్చుకునే విషయంలో మా ఆటగాళ్లకు ఎలాంటి సిగ్గు, అహంభావం లేదని టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడాలేకుండా ఒకరికొకరం సహకరించుకుంటామని తెలిపాడు.
శ్రీలంకతో గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 165 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించిన సంగతి తెలిసిందే. దేవదత్ పడిక్కల్ అద్భుత బ్యాటింగ్.. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 10 వికెట్ల ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
వారి ప్రదర్శనకు గర్వపడుతున్నా..
ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న కేఎల్ రాహుల్.. టీమిండియా డ్రెసింగ్ రూమ్ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'దేవదత్ పడిక్కల్, మానవ్ సుతార్ అద్వితీయమైన ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించడం చూసి ఓ సీనియర్ ఆటగాడిగా ఎంతో గర్వపడుతున్నా.

భారత డ్రెస్సింగ్ రూమ్ ఎంతో అహ్లాదాకరంగా, స్నేచ్ఛాయుతమైన వాతావరణంతో ఉంటుంది. ఇక్కడ సీనియర్, జూనియర్ అనే తేడా లేదు. ఆటగాళ్లు స్వేచ్ఛగా మాట్లాడటమే కాకుండా తమ అభిప్రాయాలను వ్యక్తపర్చవచ్చు. ఎన్ని మ్యాచులు ఆడామనే దానితో సంబంధం లేకుండా సహచర ఆటగాళ్లకు సహాయం చేయడం ప్రతి ప్లేయర్ బాధ్యత అని నా అభిప్రాయం.
ఎలాంటి సిగ్గు, అహంభావం లేదు..
మా జట్టులో సీనియర్ ఆటగాళ్లతో పాటు జూనియర్ ఆటగాళ్లు ఉన్నారు. కుర్రాళ్ల దగ్గర నేర్చుకోవాల్సింది ఏం లేదని సీనియర్ ఆటగాళ్లు.. సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడలేనని యువ ఆటగాళ్లు ఏదైనా చెప్పేందుకు సంకోచించరు. మా ఆటగాళ్ల మధ్య ఎలాంటి సిగ్గు, అహంభావం ఉండవు. ఆటగాళ్లు పరస్పరం ఒకరికొకరు అండగా ఉంటూ నేర్చుకుంటారు. నేర్చుకునే ప్రక్రియకు సీనియారిటీ ఏ మాత్రం అడ్డంకి కాదు.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.
సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్ 462 ఆలౌట్ (దేవదత్ పడిక్కల్ 167, కేఎల్ రాహుల్ 82, ప్రబాత్ జయసూర్య 4/109)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 284 ఆలౌట్( సొనాల్ దినుషా 100, నిరోషణ్ డిక్‌వెల్లా 80)
భారత్ రెండో ఇన్నింగ్స్ 193 ఆలౌట్(రిషభ్ పంత్ 66, దేవదత్ పడిక్కల్ 44)
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 206 ఆలౌట్ (ధనంజయ డిసిల్వా 59 , సోనాల్ దినుషా 84)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
