IND vs SL: దేవదత్ పడిక్కల్‌ను హగ్ చేసుకున్న కేఎల్ రాహుల్! నవ్వు ఆపుకోలేకపోయిన అంపైర్! (వీడియో)
శ్రీలంకతో తొలి టెస్ట్ నాలుగో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను హగ్ చేసుకున్నాడు. ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించినందుకు కృతజ్ఞతగా రాహుల్ అతన్ని ఆలింగనం చేసుకున్నాడు.
శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడని అంపైర్ ప్రకటించాడు. అయితే బంతి స్టంప్స్‌పైకి వెళ్తోందని రివ్యూ తీసుకోవాలని పడిక్కల్ సూచించాడు. దాంతో కేఎల్ రాహుల్ రివ్యూ తీసుకోగా.. రిప్లేలో బంతి వికెట్లను మిస్సైనట్లు తేలింది. దాంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆ వెంటనే కేఎల్ రాహుల్.. పడిక్కల్ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకొని కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఇద్దర్ని చూసి అంపైర్ చిరునవ్వులు చిందించాడు.
దూకుడుగా ఆడే క్రమంలో ఔటైన రాహుల్..
అయితే ఈ అవకాశాన్ని కేఎల్ రాహుల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆకాసేపటికే ప్రబాత్ జయసూర్య బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దూకుడుగా ఆడే క్రమంలో లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కండరాల నొప్పులతో బాధపడుతూనే తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేసిన రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 35 పరుగులకే ఔటయ్యాడు.

తొలి ఇన్నింగ్స్‌లో రికార్డ్ స్థాయిలో 167 పరుగులు చేసిన పడిక్కల్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం హాఫ్ సెంచరీ ముంగిట వెనుదిరిగాడు. కేశర నువంత బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్(7) కూడా నిరాశపర్చగా.. రిషభ్ పంత్(69 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) వన్డే తరహా బ్యాటింగ్‌తో దూకుడుగా ఆడాడు. అయితే హాఫ్ సెంచరీ పూర్తి అయిన అతన్ని లాహిరు కుమార కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. జడేజా(7) కూడా ఔటవ్వగా.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్ దిశగా కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ 357 పరుగుల ఆధిక్యంలో ఉంది.
భారత్ 462 ఆలౌట్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(230 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 167) సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(175 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 82) శతకాన్ని చేజార్చుకున్నాడు. ధ్రువ్ జురెల్(68 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య(4/109) నాలుగు వికెట్లు తీయగా.. కేశర నువాంత(3/175) మూడు వికెట్లు పడగొట్టాడు. అసితా ఫెర్నాండో(2/63) రెండు వికెట్లు తీసాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 284 పరుగులకు కుప్పకూలింది. సోనాల్ దినుషా(100) సెంచరీతో చెలరేగగా.. నిరోషన్ డిక్‌వెల్లా(115 బంతుల్లో 7 ఫోర్లతో 80) హాఫ్ సెంచరీతో రాణించాడు. మానవ్ సుతార్(4/76), రవీంద్ర జడేజా(3/57) అద్వితీయమైన బౌలింగ్ ప్రదర్శనతో శ్రీలంక పతనాన్ని శాసించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
