For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అడ్డొస్తే పరుగెలా తీయాలి..? బౌలర్‌తో రాహుల్ వాగ్వాదం

India vs New Zealand 3rd ODI : KL Rahul Argues With James Neesham After Blocks His Way
KL Rahul argues with James Neesham after the latter blocks his way while taking a quick single

మౌంట్‌ మాంగనూయ్‌: న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన మూడో వన్డేలోను భారత్ ఓటమిపాలైంది. ఫలితంగా 3-0తో క్లీన్‌స్వీప్‌కు గురై చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. 1989 తర్వాత మూడు అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లున్న వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయిన జట్టుగా కోహ్లీసేన అప్రతిష్టను మూటగట్టుకోనుంది. టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌కు గురైన న్యూజిలాండ్ అంతకంతకు బదులు తీర్చుకుంది.

సహనం కోల్పోయిన రాహుల్..

ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ఓ దశలో సహనం కోల్పోయాడు. అతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కివీస్ పేస్ బౌలర్ జేమ్స్ నీషమ్‌తో వాగ్వాదానికి దిగాడు. అతని బౌలింగ్‌లో బంతిని మిడాన్ దిశగా నెట్టిన కేఎల్ రాహుల్ సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరుగెత్తాడు. ఈ క్రమంలో బౌలర్ నీషమ్ వెనక్కి అడుగులు వేసుకుంటూ రాహుల్‌కి అడ్డుగా వెళ్లాడు. దీంతో.. అతన్ని ఢీకొట్టబోయిన రాహుల్.. అప్రమత్తమై తన దారిని మార్చుకుని సింగిల్ పూర్తి చేశాడు.

రికార్డుల రారాజు కోహ్లీకి ఏమైంది? 6 నెలలుగా ఒక్క సెంచరీ లేదు..?

చిన్న స్మైల్‌తో..

చిన్న స్మైల్‌తో..

బంతి విసిరిన తర్వాత పిచ్ మధ్యలో నిల్చొని ఉన్న జేమ్స్ నీషమ్ ఉద్దేశపూర్వకంగానే తన దారికి అడ్డుగా వచ్చాడని రాహుల్ ఆరోపిస్తూ అతనితో వాగ్వాదానికి దిగాడు. మధ్యలో అంపైర్ కలగజేసుకుని సర్దిచెప్పడంతో రాహుల్ వెనక్కి తగ్గాడు. కానీ.. మళ్లీ నీషమ్ తన నోటికి పని చెప్పడంతో రాహుల్ కోపంగా అతనిపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే.. ఆఖరి క్షణంలో నీషమ్ పక్కకి తప్పుకోగా.. రాహుల్ తన మోచేతిని అతనికి తాకిస్తూ వెళ్లాడు. చివరకు రాహుల్ స్మైల్ ఇవ్వడంతో ఈ గొడవ సద్దుమణిగింది.

ఐపీఎల్ టీమ్‌మెట్స్..

ఇక కేఎల్ రాహుల్, జేమ్స్ నీషమ్.. ఈ ఏడాది ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలోకి దిగనున్నారు. వేలంలో కింగ్స్ పంజాబ్ నీషమ్‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది.

‘నామ్ ఏక్.. కామ్ అనేక్'.. రాహులా నువ్వు సూపరో సూపర్!

మెరిసిన గప్టిల్, నికోలస్..

మెరిసిన గప్టిల్, నికోలస్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కేఎల్ రాహుల్ (113 బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లతో 112)

సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 296 పరుగులు చేసింది. రాహల్‌కు తోడుగా శ్రేయస్ అయ్యర్(63 బంతుల్లో 9 ఫోర్లతో 62), మనీష్ పాండే (42), పృథ్వీ షా(40) ఫర్వాలేదనిపించాడు.

అనంతరం 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 47.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 305 రన్స్ చేసి 12 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. మార్టిన్ గప్టిల్(66), హెన్రీ నికోలస్ (80) మెరుపులు మెరిపించగా.. చివర్లో గ్రాండ్‌హోమ్ (58 నాటౌట్) దాటిగా ఆడాడు.

Story first published: Tuesday, February 11, 2020, 16:00 [IST]
Other articles published on Feb 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+