For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రికార్డుల రారాజు కోహ్లీకి ఏమైంది? 6 నెలలుగా ఒక్క సెంచరీ లేదు..?

India vs New Zealand 3rd ODI : Virat Kohli Entered A Lean Phase In ODIs?
Virat Kohli in numbers in 2019-20: Has King Kohli entered a lean phase in ODIs?

హైదరాబాద్: రికార్డుల రారాజు, నిలకడకు మారుపేరైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. మైదానంలో అడుగుపెడితే బౌలర్లపై విరుచుకుపడుతూ సెంచరీల మోత మోగించే కోహ్లి.. ఈ సిరీస్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు.

 2015 తర్వాత..

2015 తర్వాత..

తొలి వన్డే హాఫ్ సెంచరీ మినహా వరుసగా రెండు వన్డేల్లోను విఫలమయ్యాడు. దీంతో భారత్ కూడా ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ సిరీస్‌లో కోహ్లీ 55,15,19 పరుగులతో మొత్తం 75 పరుగులు చేశాడు. యావరేజ్‌గా 25 పరుగులు చేశాడు. కోహ్లీ ఇంత దారుణంగా విఫలమవ్వడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. 2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఈ రన్ మెషిన్ 16.33 సగటుతో ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత ఎప్పుడూ ఇంత దారుణ ప్రదర్శన కనబర్చలేదు.

ఈ వీడియో ఏంది ఇవాళ ఇన్నిసార్లు రీట్వీట్ అవుతుంది.. డేవిడ్ వార్నర్‌పై బ్రాడ్ సెటైర్స్

గత ఆగస్టులో సెంచరీ

గత ఆగస్టులో సెంచరీ

ఇక అలవోకగా సెంచరీలు చేసే కోహ్లీ.. గత ఆరు నెలల్లో ఒక్క శతకం బాదలేకపోయాడు. గతేడాది ఆగస్టులో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేసిన భారత కెప్టెన్.. తర్వాత తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు చేసినా.. వాటిని సెంచరీలు మలుచుకోలేకపోయాడు.

‘నామ్ ఏక్.. కామ్ అనేక్'.. రాహులా నువ్వు సూపరో సూపర్!

కోహ్లీ పూర్ ఫామ్.. భారత్ ఓటమి..

కోహ్లీ పూర్ ఫామ్.. భారత్ ఓటమి..

గత తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 4,0,85,16,78, 89,51,15,9 పరుగులు చేశాడు. కోహ్లీ పూర్ ఫామ్‌తో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత్.. తాజాగా జరుగుతున్న మ్యాచ్‌లో ఓడితే వైట్‌వాష్‌కు గురవ్వనుంది. ఇదే జరిగితే 1989 తర్వాత మూడు అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లున్న సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయిన జట్టుగా కోహ్లీసేన అప్రతిష్టను మూటగట్టుకోనుంది.

రోహిత్‌తో పోలిక..

రోహిత్‌తో పోలిక..

మరోవైపు వన్డే ఫార్మాట్‌లో చెలరేగుతున్న రోహిత్ శర్మతో క్రికెట్ ఔత్సిహికులు కోహ్లీని పోల్చుతున్నారు. ఇక హిట్‌మ్యాన్ కూడా కోహ్లీకి మించి గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఆ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా ప్రాంభమైన అతని పరుగుల మోత మళ్లీ అదే జట్టుపై బెంగళూరు వేదికగా సాధించిన సెంచరీ వరకు కొనసాగింది. ఇక ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ ఐదు సెంచరీలతో చెలరేగాడు.

Story first published: Tuesday, February 11, 2020, 14:58 [IST]
Other articles published on Feb 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+