Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీఎస్‌కే‌లోకి కీరన్ పోలార్డ్.. 16 ఏళ్ల కిందటి పాపానికి ప్రాయశ్చిత్తం!

వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం కీరన్ పోలార్డ్ ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఫ్రాంచైజీ కుటుంబంలోకి అడుగుపెట్టాడు. 16 ఏళ్ల క్రితం కీరన్ పోలార్డ్ కోసం సీఎస్‌కే తీవ్రంగా ప్రయత్నించినా.. అతన్ని ముంబై ఇండియన్స్ ఎగరేసుకుపోయింది. కానీ బుధవారం జరిగిన సౌతాఫ్రికా20 లీగ్ వేలంలో మాత్రం సీఎస్‌కేకు చెందిన జోహన్నస్ బర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అతని బేస్ ప్రైజ్ రూ.87.38 లక్షలు(1.5 మిలియన్ డాలర్లు)కు కొనుగోలు చేసింది.

వాస్తవానికి ఈ లీగ్‌లో కూడా కీరన్ పొలార్డ్ ముంబై ఇండియన్స్‌కు చెందిన ముంబై కేప్‌టౌన్‌కు ఆడేవాడు. కానీ ఆ జట్టు అతన్ని రిలీజ్ చేయడంతో వేలంలో జోహన్నస్ బర్గ్ సూపర్ కింగ్స్‌ కొనుగోలు చేసింది.

IND vs WI: సంజూ ఔట్.. వైభవ్ ఇన్! విండీస్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs WI: సంజూ ఔట్.. వైభవ్ ఇన్! విండీస్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

సీఎస్‌కే పాలిట యముడిగా..

కీరన్ పొలార్డ్ అరంగేట్ర ఐపీఎల్ 2010 వేలం‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేసిన తప్పిదానికి గత 16 ఏళ్లుగా మూల్యం చెల్లించుకుంది. సీఎస్‌కేను కీరన్ పొలార్డ్ యముడిలా వెంటాడాడు. ఐపీఎల్ 2013, 2015, 2019 ఫైనల్స్‌లో చెన్నైసూపర్ కింగ్స్ పతనాన్ని శాసించాడు.

ఈ ఫైనల్సే కాకుండా ఇతర మ్యాచ్‌ల్లోనూ తన విధ్వంసకర ఆటతో సీఎస్‌కేను ఓడించాడు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే జట్టుపై ముంబై ఇండియన్స్ 219 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కీరన్ పొలార్డ్ కీలక పాత్ర పోషించాడు. అతను కేవలం 34 బంతుల్లోనే 87 పరుగులు చేసి సీఎస్‌కే ఓటమిని శాసించాడు.

Kieron Pollard Joins CSK s Johannesburg Super Kings for 2027 SA20 Season After Leaving MI Cape Town

ఐపీఎల్‌లోనే కాదు ఇతర ఫ్రాంచైజీ లీగ్స్‌ల్లో కూడా సీఎస్‌కే ఫ్రాంచైజీలను ఇబ్బంది పెట్టాడు. 2025 మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ తరఫున 22 బంతుల్లో 47 పరుగులు చేసి సీఎస్‌కేకు చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఓడించాడు. ఈ విజయంతో ఫైనల్ చేరిన ఎంఐ న్యూయార్క్ రెండో టైటిల్ అందుకుంది.

2010 వేలంలో ఏం జరిగిందంటే..?

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ అయిన కీరన్ పోలార్డ్ ఐపీఎల్ 2010 సీజన్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ సీజన్ వేలంలో పొలార్డ్ కోసం సీఎస్‌కే, ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ, కేకేఆర్ తీవ్రంగా పోటీ పడ్డాయి. అప్పటి వేలం నిబంధనల ప్రకారం గరిష్ట బిడ్( రూ.3.5 కోట్లు) వేసాయి. కానీ ముంబై టై బ్రేకర్‌లో పొలార్డ్‌ను సొంతం చేసుకుంది.

సెంచరీ కోసం కాదు.. అందుకే శ్రేయస్ అయ్యర్‌కు స్ట్రైక్ ఇచ్చా: ఇషాన్ కిషన్

Also Read

సెంచరీ కోసం కాదు.. అందుకే శ్రేయస్ అయ్యర్‌కు స్ట్రైక్ ఇచ్చా: ఇషాన్ కిషన్

నాలుగు ఫ్రాంచైజీలు ఒకే ధర వద్ద ఆగడంతో టై-బ్రేకర్ పద్దతిని ఉపయోగించారు. ఇందులో భాగంగా ప్రతి టీమ్ ఒక కవర్‌లో రహస్యంగా అదనంగా ఎంత డబ్బు ఇవ్వగలరో రాసి ఇచ్చారు. ఈ సీక్రెట్ వేలంలో ముంబై ఇండియన్స్ అందరికంటే ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో పోలార్డ్ వారి సొంతమయ్యాడు. అప్పటి నుంచి పొలార్డ్ రిటైర్ అయ్యే వరకు ముంబైకే ఆడాడు. ఐపీఎల్ 2023 సీజన్ ముందు ముంబై బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. పొలార్డ్‌ను సొంతం చేసుకోకపోవడంతో సీఎస్‌కే మూల్యం చెల్లించుకుంది. ఇన్నాళ్లకు అతన్ని కొనుగోలు చేసి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంది.

Story first published: Thursday, October 8, 2026, 11:53 [IST]
Other articles published on Oct 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+