Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వినోద్ కాంబ్లీ ఏమయ్యాడు..? వైభవ్‌కు ఇంకా 16 ఏళ్లే: కపిల్ దేవ్

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. అతనిలో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ.. గతంలో ఈ తరహా నైపుణ్యంతో వచ్చి కనుమరుగైన వాళ్లు చాలా మంది ఉన్నారని అభిప్రాయపడ్డారు.

వినోద్ కాంబ్లీనే ఇందుకు చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 1983 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ అయిన కపిల్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడేళ్లు వైభవ్‌కు అత్యంత కీలకమని నొక్కి చెప్పాడు.

యువరాజ్ సింగ్ తండ్రి నా జిగ్రీ దోస్త్.. కానీ వాడ్ని కలవను: కపిల్ దేవ్

యువరాజ్ సింగ్ తండ్రి నా జిగ్రీ దోస్త్.. కానీ వాడ్ని కలవను: కపిల్ దేవ్

వచ్చే మూడేళ్లు వైభవ్‌‌కు ముఖ్యం..

'వైభవ్ సూర్యవంశీ గురించి ఇప్పుడే మాట్లాడటం చాలా తొందరపాటు అవుతుంది. అతనిలో అపారమైన ప్రతిభ ఉంది. కానీ అద్భుతమైన నైపుణ్యంతో వచ్చి.. ఆ తర్వాత కనుమరుగైపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. వినోద్ కాంబ్లీనే ఇందుకు చక్కని ఉదాహరణ. అతని గురించి ఇప్పుడు ఏం చెప్పుకుంటాం? వైభవ్‌ సూర్యవంశీకి ఇంకా 16 ఏళ్లే.

Kapil Dev Says So Many Have Faded Out Warns Vaibhav Sooryavanshi Using Vinod Kambli Example

అతనికి మరో మూడేళ్లు టైమ్ ఇవ్వండి. ఆ తర్వాతే అతని గురించి మాట్లాడుదాం. వయసు పెరిగేకొద్దీ లైఫ్‌స్టైల్ మారుతుంది. అతని ఆలోచనలూ మారతాయి. రాబోయే రెండేళ్లలో అతన్ని అతను ఎలా మలుచుకుంటాడో చూడాలి. ప్రస్తుత ప్రదర్శన కంటే అదే చాలా ముఖ్యం.'అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.

తదుపరి స్టార్లు ఎవరు..?

భారత్ తదుపరి స్టార్‌ను చూసేందుకు ఆసక్తిగా ఉన్నానని కపిల్ దేవ్ తెలిపారు. 'భారత స్టార్ క్రికెటర్లుగా రోహిత్, విరాట్‌లను చూశాం. అంతకుముందు సచిన్‌ టెండూల్కర్‌ను చూశాం. వాళ్లు భారత అభిమానులను ఎంతో గర్వపడేలా చేశారు. కానీ జనాలు ఎప్పుడూ 'తర్వాతి హీరో ఎవరు?' అని కొత్తవాళ్ల కోసమే వెతుకుతుంటారు.

ఒక క్రికెటర్‌గా నా మనసు కూడా అదే ఆలోచిస్తుంది. 'వచ్చిన అవకాశాన్ని వాడుకుని, విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేస్తూ మరో 15 ఏళ్ల పాటు దేశం కోసం ఆడే ఆ కుర్రాడు ఎవడు?' అని నేను ఎదురు చూస్తున్నాను.'అని కపిల్ దేవ్ అన్నారు.

అసలు వాళ్లు మన రేంజా అస్సలు కాదు.. ఇకనైనా పోలికలు ఆపేయండి సామీ!

Also Read

అసలు వాళ్లు మన రేంజా అస్సలు కాదు.. ఇకనైనా పోలికలు ఆపేయండి సామీ!

ఎంత ఎక్కువ ఆడితే అంత మంచిది..

వర్క్‌లోడ్ పేరిట ఆటగాళ్లను మ్యాచ్‌లకు దూరం చేయడం సరికాదని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ఎంత ఎక్కువ ఆడితే.. శరీరం అంతగా అలవాటు పడుతుందని చెప్పారు. 'ఎక్కువ క్రికెట్ ఆడండి. ఎంత ఎక్కువ ఆడితే మీ శరీరం దానికి అంతగా అలవాటుపడుతుంది. అలా కాకుండా తక్కువ ఆడి, హఠాత్తుగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే గాయాలయ్యే అవకాశాలు పెరుగుతాయి. కండరాలు బలంగా ఉంటేనే గాయాలు తక్కువగా అవుతాయి.

జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలర్. అతనికి హాట్సాఫ్ చెప్పాల్సిందే. అలాంటి బౌలింగ్ యాక్షన్‌తో కొనసాగడం కష్టమనే మాలాంటి వాళ్ల అభిప్రాయాలను తప్పు అని నిరూపించాడు. అంత విచిత్రమైన యాక్షన్‌తో అతను ఇన్ని రోజులు రాణించగలడని, ఇలా ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్ అవుతాడని మేం అస్సలు ఊహించలేదు. నిజంగా హాట్సాఫ్!'అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, October 8, 2026, 18:12 [IST]
Other articles published on Oct 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+