Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువరాజ్ సింగ్ తండ్రి నా జిగ్రీ దోస్త్.. కానీ వాడ్ని కలవను: కపిల్ దేవ్

యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగ్ రాజ్ సింగ్‌ ఇప్పటికీ తనకు స్నేహితుడేనని, కానీ అతన్ని కలిసేందుకు ఇష్టపడనని భారత దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. యోగ్‌రాజ్ సింగ్ వంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిదని అభిప్రాయపడ్డాడు.

కపిల్ దేవ్‌తో పాటు జాతీయ జట్టుతో పాటు దేశవాళీ క్రికెట్ ఆడిన యోగ్ రాజ్ సింగ్.. తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అవకాశం వచ్చినప్పుడల్లా ధోనీ, కపిల్ దేవ్‌పై విమర్శలు గుప్పిస్తుంటాడు. యోగ్‌రాజ్ తరఫున ధోనీ, కపిల్ దేవ్‌కు యువరాజ్ సింగ్ క్షమాపణలు కూడా చెప్పాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కపిల్ దేవ్.. యోగ్ రాజ్ సింగ్‌ విమర్శలపై స్పందించాడు.

వైభవ్‌ సూర్యవంశీని మరి అంతగా లేపకండి: కపిల్ దేవ్

వైభవ్‌ సూర్యవంశీని మరి అంతగా లేపకండి: కపిల్ దేవ్

యువీ క్షమాపణలు చెప్పాడు..

'యోగ్‌రాజ్ సింగ్‌ బదులు అతని కొడుకు యువరాజ్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. అలా చెప్పాల్సిన అవసరం కూడా యువరాజ్ సింగ్‌కు లేదు. అయినా ఇదంతా గతం. యువరాజ్ సింగ్ గొప్ప క్రికెటర్. దేశానికి అతను అందించిన సేవలను మరిచిపోలేం. క్రికెట్ మరింత పాపులర్ కావడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికీ అభిమానులు అతన్ని ఆరాధిస్తారు.

Kapil Dev Responds to Yuvraj Father Yograj Singh s Wild Accusations Move On He is Still My Friend

అసలు అతనేం చెప్పాలనుకుంటున్నాడో తెలియడం లేదు. ఇప్పటికీ నాకు అతను స్నేహితుడే. నా వైపు నుంచి ఎలాంటి సమస్యా లేదు. కానీ ఇలాంటి వ్యక్తులను కలిసేందుకు నేను అస్సలు ఇష్టపడను. సంతోషంగా ఉండే వ్యక్తులను మాత్రమే కలుస్తా. ఈర్ష్యతో రగిలిపోయే వ్యక్తులను ఎవరూ ప్రేమించరు. ఎవరికీ ఏది తేలిగ్గా రాదు. కొన్నిసార్లు మనకు వస్తుంది. మరికొన్నిసార్లు మన కుటుంబ సభ్యులకు అవకాశం దక్కుతుంది.

ధోనీ, కపిల్ దేవ్‌కు క్షమాపణలు చెప్పిన యువరాజ్ సింగ్.. ఎందుకంటే?

ధోనీ, కపిల్ దేవ్‌కు క్షమాపణలు చెప్పిన యువరాజ్ సింగ్.. ఎందుకంటే?

నేను కూడా అలానే మాట్లాడితే ఎలా..?

వచ్చినదానితో సంతృప్తి పడాలి. అతని కొడుకు అద్భుతం చేశాడు. నేను కూడా యోగ్‌రాజ్ సింగ్ తరహాలో అసభ్యంగా మాట్లాడితే పరిస్థితి ఏంటి? జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను చూశాం. చాలా మంది భారత జట్టులో ఆడాలని కోరుకుంటారు. అలాగే సినిమాల్లో అవకాశం కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. మిగతా వారితో పోల్చితే యోగ్‌రాజ్‌‌కే ఎక్కువ అవకాశాలు దక్కాయి. అతని కొడుకు స్టార్ క్రికెటర్. యోగ్‌రాజ్ సింగ్ సినిమాల్లో కూడా నటించాడు. అయినా సంతోషపడకపోతే ఎలా? ఇలానే ఉంటే ఎప్పటికీ ఇలాగే మిగిలిపోతాడు.

యోగ్‌రాజ్ సింగ్‌‌ను హగ్ చేసుకునే విషయంలో నాకేం అభ్యంతరం లేదు. అతను నా చిన్ననాటి స్నేహితుడు. మేమిద్దరం ఒకే కోచ్ (దేశ్ ప్రేమ్ ఆజాద్) వద్ద క్రికెట్ నేర్చుకున్నాం. ఇద్దరం కలిసే పెరిగాం. పెళ్లై విడాకులు తీసుకున్నంత మాత్రాన గతంలోని మంచి రోజులను మర్చిపోకూడదు.' అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, July 9, 2026, 15:20 [IST]
Other articles published on Jul 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+