కావ్య పాపతో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు ఆహ్వానం!
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్, సన్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్యా మారన్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి ఖారారైంది. నవంబర్ 21న చెన్నై వేదికగా వీరి వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరగనుంది.
తమ కుమార్తె వివాహ విందుకు రావాల్సిందిగా సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ దంపతులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి దంపతులను వారు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
కేటీఆర్‌కు కూడా ఆహ్వానం..
బీఆర్ఎస్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దంపతులను కూడా కళానిధి మారన్, ఆయ సతీమణి హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా విందుకు హాజరు కావాల్సిందిగా వివాహ పత్రికను అందజేశారు.

అనిరుధ్, కావ్య మారన్ గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇవి పుకార్లని అనిరుధ్‌తో పాటు కావ్య మారన్ సన్నిహితులు ఖండించారు. సన్నెట్ వర్క్ అయితే మీడియా సంస్థలకు నోటీసులు కూడా పంపించింది. పుకార్లను వ్యాప్తి చేయవద్దని హెచ్చరించింది.
గ్రీస్‌లో పెళ్లి..
అత్యంత సన్నిహితుల మధ్య నవంబర్ 10-11 తేదీల్లో గ్రీస్ వేదికగా వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. వివాహ అనంతరం చెన్నై వేదికగా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్‌కు దేశంలోని ప్రముఖులు అంతా హాజరయ్యే అవకాశం ఉంది. మిగతా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక ఆటగాళ్లు కూడా ఈ రిసెప్షన్‌కు హాజరు కావచ్చు.
సన్నెట్ వర్క్ నిర్మించిన జైలర్, జైలర్-2 చిత్రాలకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కావ్య మారన్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటలు ఎక్కించినట్లు తెలుస్తోంది.
హర్ట్ అవుతున్న ఫ్యాన్స్..
మరోవైపు కావ్య మారన్ పెళ్లి వార్తలతో ఆమె అభిమానులు బాధకు గురవుతున్నారు. ఆమె అందానికి పడిపోయే ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. కేవలం ఆమె కోసమే సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లకు హాజరయ్యే ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతలా కావ్య మారన్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆమెను ఫ్యాన్స్ ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


