Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్చర్.. బచ్చాగాళ్లపై గెలిచి బలుపు మాటలా? భారత్ సత్తా తెలిసిందా?

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మంగళవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లోభారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

IND vs ENG: ఆ ఘోర తప్పిదమే మా ఓటమిని శాసించింది: హ్యారీ బ్రూక్

IND vs ENG: ఆ ఘోర తప్పిదమే మా ఓటమిని శాసించింది: హ్యారీ బ్రూక్

ఈ గెలుపుతో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన రీతిలో మండిపడుతున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని యువ జట్టు దారుణంగా విఫలమైంది. జట్టులో చాలా మంది ఆటగాళ్లకు ఇంగ్లండ్ పర్యటన కొత్త కావడంతో స్వింగ్ కండిషన్స్‌లో బ్యాటింగ్ చేయలేకపోయారు. కుర్రాళ్లపై నిప్పులు చెరిగిన ఆర్చర్.. అత్యుత్సాహంతో వారిని కించపర్చే వ్యాఖ్యలు చేశాడు.

Jofra Archer Brutally Trolled on Social Media After India Beat England in 1st ODI

ఇది ఐపీఎల్ కాదని, అంతర్జాతీయ క్రికెట్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో పిచ్‌లు బౌలింగ్‌కు ప్రతికూలంగా ఉంటాయని, దాంతో బ్యాటర్లు చెలరేగుతారని భారత ఆటగాళ్లను అవమానించాడు. ఐపీఎల్‌ను కూడా కించపర్చాడు.

వన్డే సిరీస్‌లో భారత సీనియర్ ఆటగాళ్లు బరిలోకి దిగడంతో ఆర్చర్‌తో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లు తోకముడిచారు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరగగా.. ఇంగ్లండ్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బుమ్రా సారథ్యంలో ఇతర బౌలర్లు కూడా సత్తా చాటడంతో ఇంగ్లండ్ 258 పరుగులకే కుప్పకూలింది. అనంతరం శుభ్‌న్ గిల్,అక్షర్ పటేల్, సుందర్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో ఇంగ్లండ్ ఓటమికి తలవంచింది.

IND vs ENG: ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్.. చిత్తుగా ఓడిన బ్రూక్ సేన!

IND vs ENG: ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్.. చిత్తుగా ఓడిన బ్రూక్ సేన!

ఈ విజయం నేపథ్యంలో ఆర్చర్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఆర్చర్.. బచ్చాగాళ్లపై గెలిచి బలుపు మాటలా? ఇప్పుడు భారత్ సత్తా తెలిసిందా?'అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. 'కుర్రాళ్లపై చెలరేగినట్లు కాదు.. సీనియర్ ఆటగాళ్లపై ఆధిపత్యం చెలాయించు'అని సవాల్ విసురుతున్నారు. ఇకనైనా భారత్‌, ఐపీఎల్ గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హితవు పలుకుతున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే గురువారం జరగనుంది. ఈ మ్యాచ్‌ కూడా గెలిస్తే సిరీస్ భారత్ వశమవుతోంది.

Story first published: Wednesday, July 15, 2026, 11:06 [IST]
Other articles published on Jul 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+