Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: ఆ ఘోర తప్పిదమే మా ఓటమిని శాసించింది: హ్యారీ బ్రూక్

టాపార్డర్ బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో 20 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయామని, అక్కడే తమ ఓటమి ఖాయమైందని అభిప్రాయపడ్డాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

IND vs ENG తొలి వన్డేలో ధోనీ సందడి.. ముసలోడిని అయిపోయా అంటూ సైగలు! (వీడియో)

IND vs ENG తొలి వన్డేలో ధోనీ సందడి.. ముసలోడిని అయిపోయా అంటూ సైగలు! (వీడియో)

బ్యాటింగ్ వైఫల్యమే..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హ్యారీ బ్రూక్.. బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు.' ఇది మేం ఆశించిన ఫలితం కాదు. మిడిల్ ఓవర్లలో మేం 20 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయాం. ఇదే మా ఓటమిని శాసించింది. ఆ తర్వాత మా ఆటగాళ్లు పుంజుకొని పోరాడే లక్ష్యాన్ని అందించినా అది సరిపోలేదు. కానీ మా బ్యాటర్లు పోరాడిన తీరు అద్భుతం.

Harry Brook Blames England s Middle-Order Batting Collapse for 1st ODI Defeat to India at Edgbaston

మా బ్యాటింగ్‌ మెరుగవ్వాల్సిన అసవరం ఉంది. 20 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోవడం ఎప్పుడూ మంచిది కాదు. మేం ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. కానీ దారుణంగా విఫలమైన తర్వాత కూడా జోరూట్, లియామ్ డాసన్ ఆడిన తీరు.. జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించడం అద్భుతం.

పిచ్ మారకుంటే గెలిచేవాళ్లం..

పిచ్ మారడంతోనే మా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయాం. ఒకవేళ పిచ్ తొలి ఇన్నింగ్స్ తరహాలోనే ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అలా కాకుండా పిచ్ నెమ్మదించడంతో సులువుగా పరుగులు చేశారు. ఓవర్‌కు 5-6 పరుగులే చేయాల్సి ఉండటంతో స్వేచ్ఛగా ఆడి విజయాన్ని అందుకున్నారు.

పిచ్ కండిషన్స్ బట్టి మా కాంబినేషన్‌ను మారుస్తాం. మేం ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే మా స్పిన్నర్ భారత్ పతనాన్ని శాసించేవారు. కానీ 20 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. 320-330 పరుగులు చేసి ఉంటే మా స్పిన్నర్లు విజయాన్ని అందించేవారు.

రెండో వన్డే వేదికకు చేరుకున్న తర్వాతే కాంబినేషన్‌పై తుది నిర్ణయం తీసుకుంటాం. ఆ మ్యాచ్‌లో పుంజుకోవాలని ఆశిస్తున్నాం.'అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు.

IND vs ENG: ఆ గుండె కోత తర్వాత 969 రోజులకు..! (వీడియో)

IND vs ENG: ఆ గుండె కోత తర్వాత 969 రోజులకు..! (వీడియో)

అదరగొట్టిన అక్షర్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జోరూట్(76 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 76 నాటౌట్), లియామ్ డాసన్(83 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 68) హాఫ్ సెంచరీలతో రాణించగా.. బెన్ డకెట్(45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్‌ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జస్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబేకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి 28 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. శుభ్‌మన్ గిల్‌, అక్షర్ పటేల్‌(52 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 57 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. శ్రేయస్ అయ్యర్(35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, సామ్ కరణ్ తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, July 15, 2026, 0:02 [IST]
Other articles published on Jul 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+