Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG రెండో వన్డే: కేఎల్ రాహుల్‌పై వేటు.. ఎందుకంటే..?

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. దాంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఒక మార్పు చేసింది. సీనియర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. అతని స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగాడు.

రాహుల్‌కు అనారోగ్యం..

కేఎల్ రాహుల్ అనారోగ్యానికి గురవ్వడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని చెప్పాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. గత మ్యాచ్‌లో మేం సమష్టి ప్రదర్శన కనబర్చాం. ఈ రోజు కూడా అదే తరహా ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నా.

Shubman Gill Reveals The Reason Why KL Rahul Is Not Playing 2nd ODI Against England at Cardiff

గత మ్యాచ్‌లో పవర్ ప్లేలో తొలి 6-7 ఓవర్లు బాగానే వేశాం. కానీ ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాటర్లు మాపై ఒత్తిడికి తెచ్చారు. కానీ మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు పుంజుకున్న తీరు.. వికెట్లు తీసిన విధానం అద్భుతంగా అనిపించింది. గతంలో ఇక్కడ నేను ఆడాను. మంచి జ్ఞాపకాలున్నాయి. అందులో మరొకటి చేరుతుందని ఆశిస్తున్నా. మా జట్టులో ఒక మార్పు చేశాం. అనారోగ్యంతో కేఎల్ రాహుల్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

అంత సులువుగా వదిలిపెట్టం..

మరోవైపు పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే బౌలింగ్ ఎంచుకున్నామని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తెలిపాడు. 'పిచ్‌పై గడ్డి ఉంది. కాబట్టి ఆరంభంలో బంతి సీమ్, స్వింగ్ అవుతుందని ఆశిస్తున్నా. గత మ్యాచ్ ఓటమితో మా ప్రణాళికలను ఇంకాస్త మెరుగ్గా అమలు చేయాలనుకుంటున్నాం. ఏ మ్యాచ్‌లోనూ మేం అంత సులువుగా పట్టు వదలం. గత మ్యాచ్‌లో కూడా గట్టిపోటీని ఇచ్చాం.

మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకెళ్లాం. ఈ రోజు కూడా అలాంటి తరహా ప్రదర్శననే ఆశిస్తున్నాం. మా తుది జట్టులో రెండు మార్పులు చేశాం. జోష్ టంగ్, లియామ్ డాసన్ స్థానాల్లో సాకిబ్ మహమూద్, గస్ అట్కిన్సన్ ఆడుతున్నారు.'అని బ్రూక్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు..

భారత్:రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ.

ఇంగ్లండ్: బెన్ డకెట్, జాకోబ్ బెతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కరన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.

Story first published: Thursday, July 16, 2026, 17:54 [IST]
Other articles published on Jul 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+