పాకిస్థాన్‌ను చూసి ఈ ప్రపంచం నవ్వుతుంది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ విమర్శలు గుప్పించాడు. పీసీబీ అనాలోచిత నిర్ణయాలతో ఈ ప్రపంచం ముందు పాకిస్థాన్ నవ్వుల పాలైందని మండిపడ్డాడు. మాజీ ఆటగాళ్ల విమర్శలతో పాకిస్థాన్‌కు ఈ పరిస్థితి రాలేదని, పీసీబీ పెద్దల వల్లే ఈ గతి పట్టిందన్నాడు.
మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఓడిన పాకిస్థాన్.. రెండో టెస్ట్‌లో 194 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ పరాజయాలను సీరియస్‌గా పరిగణించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఏకంగా ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది.
కోచ్‌లపై కూడా వేటు..
ఇందులో మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. అంతేకాకుండా హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను తప్పించింది. మైక్‌హెస్సేన్‌ను టెస్ట్ కోచ్‌గా నియమించింది. ఐదుగురు అనమాక ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. ఈ మార్పులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ మార్పులపై స్పందించిన నాజర్ హుస్సేన్.. పీసీబీపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'తొలి టెస్ట్ పరాజయం తర్వాత పాకిస్థాన్‌ను చూసి ఈ ప్రపంచం నవ్వుతుందని నేను అనుకోవడం లేదు. లార్డ్స్ టెస్ట్‌లో పాకిస్థాన్ కనీస పోటీ ఇవ్వలేదని, భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లు పూర్తిగా ఏకపక్షంగా సాగుతున్నాయని, వాళ్లది ఒక బలహీనమైన జట్టు అని నేను అనడం వారిని ఎగతాళి చేయడం కాదు.
నేను కాదు.. వారే నవ్వుల పాలు చేశారు..
ఒక గొప్ప క్రికెట్ దేశం ఇంతలా దిగజారడం చూసి కలిగిన నిరాశతో అన్న మాటలు అవి. నా మాటల వల్ల కాదు.. పీసీబీ అనాలోచిత నిర్ణయాలతో పాకిస్థాన్ టీమ్‌ను నవ్వుల పాలు చేశారు. పరిస్థితిని మరింత దిగజార్చారు. ఇమామ్ ఉల్ హక్ గాయంపై ఉన్నత స్థాయి డైరెక్టర్ బహిరంగంగా విమర్శించడం ఆశ్చర్యం కలిగించింది. ఒక వేళ ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి. కానీ అతనికి గాయమైందా? లేదా? అనేది తెలియకుండా అతని గురించి సందేహాలు వ్యక్తం చేస్తూ బలిపశువును చేయడం ఏంటి? ఇమామ్ విషయంలో పాకిస్థాన్ జట్టు వ్యవహరించిన తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది.'అని నాజర్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు.
లార్డ్స్ టెస్ట్‌లో ఇమామ్ ఉల్ హక్.. గాయంతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటింగ్ చేయలేదు. అయితే బ్రేక్ సమయంలో కాలికి పట్టీ వేసుకొని అతను వామప్ చేయడం విమర్శలకు దారి తీసింది. ఇమామ్ ఉల్ హక్ గాయం డ్రా ఆడాడనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై పీసీబీ విచారణకు ఆదేశించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

