Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs JPN: జపాన్‌తో తలపడే భారత తుది జట్టు ఇదే.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!

ఆసియా గేమ్స్ 2026 కోసం జపాన్‌కు వెళ్లిన టీమిండియా ఆతిథ్య దేశంతో స్నేహపూర్వక మ్యాచ్ ఆడనుంది. మంగళవారం జపాన్ రాజధాని టోక్యోలోని సానో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం‌ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మెరుగైన ఐసీసీ ర్యాంకుతో ఆసియా గేమ్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

అతను టీమిండియా ఫ్యూచర్.. కానీ తొందరొద్దు: జయసూర్య

అతను టీమిండియా ఫ్యూచర్.. కానీ తొందరొద్దు: జయసూర్య

ఈ మ్యాచ్‌కు ముందు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకునేందుకు జపాన్‌తో ఈ స్నేహపూర్వక మ్యాచ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జపాన్‌లో క్రికెట్‌పై ఆదరణ పెంచే ఉద్దేశం కూడా ఈ మ్యాచ్‌ వెనుక ఉంది. పసికూన జపాన్‌కు ఇది మంచి అవకాశం. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

India Playing XI vs Japan No Chance for Vaibhav Sooryavanshi as Sanju Samson Continues as Opener

అయితే ఈ నామమాత్రపు టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీనియర్ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి యువ ప్లేయర్లను ఆడిస్తారా? లేక రెగ్యులర్ టీమ్ కాంబినేషన్‌ను కొనసాగిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే ఆసియా గేమ్స్‌కు ముందు సన్నాహకంగా ఈ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి టీమిండియా ఎలాంటి అలసత్వం ప్రదర్శించే అవకాశం లేదు.

వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్..

ఈ పర్యటనలో వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రధాన ఆటగాళ్లందరూ జపాన్‌తో ఆడే అవకాశం ఉంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఆడించాలనుకుంటే సంజూ శాంసన్, అభిషేక్ శర్మలో ఒకరికి విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఇద్దరు ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఈ జోడీని విడదీసే సాహనం లక్ష్మణ్ చేస్తాడా? లేదా? అనేది చూడాలి. ఒకవేళ సంజూ, అభిషేక్ శర్మలను ఓపెనర్లుగా కొనసాగిస్తే.. వైభవ్ బెంచ్‌కే పరిమితమవుతాడు.

Asian Games 2026: వైభవ్ సూర్యవంశీని ఊరిస్తున్న చారిత్రాత్మక రికార్డ్!

Also Read

Asian Games 2026: వైభవ్ సూర్యవంశీని ఊరిస్తున్న చారిత్రాత్మక రికార్డ్!

మూడో స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగనుండగా.. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. ఐదో స్థానంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ బరిలోకి దిగనుండగా.. ఆల్‌రౌండర్లుగా శివమ్ దూబే, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్ అవకాశం అందుకోనున్నారు. జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్ దీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ ఆడనున్నాడు. బుమ్రాకు రెస్ట్ ఇస్తే యష్ ఠాకూర్ బరిలోకి దిగుతాడు.

జపాన్‌తో ఏకైక టీ20కి భారత తుది జట్టు(అంచనా)..

అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్)/వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా/యశ్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్.

ఆసియా క్రీడల కోసం భారత్ టీ20 జట్టు:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్.

Story first published: Monday, September 21, 2026, 17:24 [IST]
Other articles published on Sep 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+