IND vs NZ: రఫ్ఫాడించిన జకోబ్ డఫీ.. చిత్తుగా ఓడిన భారత్
న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్‌కు నాలుగో టీ20లో చుక్కెదురైంది. శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 87 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. చెత్త బౌలింగ్, పేలవ బ్యాటింగ్ టీమిండియా పతనాన్ని శాసించాయి. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్ ఖాతా తెరిచి 3-1తో క్లీన్ స్వీప్‌ను తప్పించుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 259 పరుగుల భారీ స్కోర్ చేసింది. గ్లేన్ ఫిలిప్స్(49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107) అజేయ శతకంతో చెలరేగగా.. మైఖేల్ బ్రేస్‌వెల్(25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్(3/48) మూడు వికెట్లు తీయగా.. ప్రిన్స్ యాదవ్(1/49), అక్షర్ పటేల్(1/43), అర్ష్‌దీప్ సింగ్(1/38), నితీష్ కుమార్ రెడ్డి(1/64) చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులే చేసి ఓటమిపాలైంది. తిలక్ వర్మ(35 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 35), నమన్ ధీర్(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28), అభిషేక్ శర్మ(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ డఫీ(4/19) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్(2/17), మాథ్యూ ఫిషర్(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆడమ్ మిల్నేకు ఒక వికెట్ దక్కింది.
పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్..
260 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ రెండో బంతికే సంజూ శాంసన్(4) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. జాకోబ్ డఫీ వేసిన అదే ఓవర్‌లో ఇషాన్ కిషన్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో భారత్ 4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడారు. అయితే అభిషేక్ శర్మను ఫిషర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్(22)ను మిల్నే క్లీన్ బౌల్డ్ చేయడంతో పవర్ ప్లేలోనే భారత్ 4 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది.
రెండు సిక్స్‌లతో దూకుడుగా ఆడిన నితీష్ కుమార్ రెడ్డి(21)ని మిచెల్ సాంట్నర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్‌లో అక్షర్ పటేల్(7)ను సాంట్నర్ రిటర్న్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. దాంతో 89 పరుగులకే భారత్ 6 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మ, నమన్ ధీర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నమన్ ధీర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అయితే స్మిత్ అద్భుతమైన రిలే క్యాచ్‌తో నమన్ ధీర్ వెనుదిరిగాడు. ఆ వెంటనే అర్ష్‌దీప్ సింగ్(0) గోల్డెన్ డకౌట్ కాగా.. ప్రిన్స్ యాదవ్‌తో తిలక్ వర్మ ఆచితూచి ఆడాడు. కానీ అతన్ని ఫిషర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆలౌట్ కాకుండా ప్రిన్స్ యాదవ్ చివరివరకు ఆడి భారత ఇన్నింగ్స్‌ను ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


