చాలా చెత్తగా ఆడాం.. ఆ తప్పిదమే దెబ్బతీసింది: శ్రేయస్ అయ్యర్
ఇంగ్లండ్‌తో మూడో టీ20లో తమ ప్రదర్శన చాలా చెత్తగా ఉందని టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 125 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసింది.
202 పరుగల భారీ లక్ష్యఛేదనలో టీమిండియా 76 పరుగులకే ఆలౌటైంది. టీ20 క్రికెట్ చరిత్రలోనే టీమిండియాకు ఇది అత్యంత ఘోర పరాజయం. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడకపోవడంతోనే ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నామని తెలిపాడు.
ఈ వికెట్‌పై 200 పరుగులు ఇవ్వడం సరికాదని, బ్యాటింగ్‌లో పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. 'మా ప్రదర్శన చాలా చెత్తగా ఉంది. ఇంత భారీ తేడాతో ఓడిపోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ ఓటమిని మేం అంగీకరించాల్సిందే. అదే విధంగా మా ఆటతీరుపై పునరాలోచన చేయాల్సి ఉంది.

ఈ పిచ్‌పై బౌలర్లు 200 పరుగులు ఇవ్వడం సరికాదు. ఛేజింగ్‌లో పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయాం. అదే మమ్మల్ని దెబ్బతీసింది. టీమ్ మీటింగ్‌లో చాలా ప్రణాళికలు చేయవచ్చు. కానీ.. మైదానంలోకి వచ్చాక పరిస్థితులకు తగ్గట్లు ఆడాలి.
ఈ పిచ్‌పై బౌలర్లకు హార్డ్ లెంగ్త్ బాగా కలిసొచ్చింది. కానీ మేం హార్డ్ లెంగ్త్స్ వేయలేకపోయాం. ఓటముల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. ఆటగాళ్లు జట్టు విజయాల్లో తమదైన ముద్ర వేయడం గురించి ఆలోచించాలి. మేం బలంగా పుంజుకోవాలి. మా ప్రదర్శన ఏ మాత్రం బాలేదు.'అని శ్రేయస్ అయ్యర్ విచారం వ్యక్తం చేశాడు.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. పసికూన ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో 2-0తో క్లీన్ స్వీప్ అయిన భారత్.. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు పరాజయాలను మూటగట్టుకుంది. తొలి మ్యాచ్ వర్షార్పణ కావడంతో మరో ఓటమిని తప్పించుకుంది. టీ20 చరిత్రలోనే వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో భారత్ ఒక్క మ్యాచ్ గెలవకపోవడం ఇదే తొలిసారి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

