మెంటల్ ఎక్కించి మెడిటేషన్ చేస్తున్నాడు! (వీడియో)
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మపై సహచర ఆటగాడు ఇషాన్ కిషన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు మెంటల్ ఎక్కించి తాను మాత్రం మెడిటేషన్ చేస్తున్నాడని సెటైర్లు పేల్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అభిషేక్ శర్మ(38 బంతుల్లో9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 113), వైభవ్ సూర్యవంశీ(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45) విధ్వంసకర బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు. పవర్ ప్లేలోనే 118 పరుగుల రికార్డ్ స్కోర్‌ను నమోదు చేసి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.

అయితే 35 బంతుల్లో సెంచరీ చేసిన అనంతరం అభిషేక్ శర్మ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. మైదానంలో కూర్చొని మెడిటేషన్ చేశాడు. అయితే ఈ సెలెబ్రేషన్స్‌పై ఇషాన్ కిషన్ తనదైన శైలిలో స్పందించాడు. టీమ్ బస్‌లో హోటల్‌కు వెళ్లే సమయంలో అభిషేక్ శర్మ పక్కన కూర్చున్న ఇషాన్ కిషన్.. సెల్ఫీ వీడియో తీసాడు. ఈ వీడియోలో హిందీలో మాట్లాడిన ఇషాన్ కిషన్.. ఇతరుల మెంటల్ హెల్త్ ఖరాబ్ చేసి, ఇతను మాత్రం మెడిటేషన్ చేస్తాడు'అని అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(52 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫిన్ అలెన్(25 బంతుల్లో 5 సిక్స్‌లతో 40), బెవాన్ జాకబ్స్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39 నాటౌట్) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 13.2 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మతో పాటు టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45) దూకుడుగా ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమీసన్(2/41) రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ ఫిషర్, మిచెల్ సాంట్నర్ చెరో వికెట్ తీసారు. భారత ఓపెనర్ల ధాటికి న్యూజిలాండ్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. ఈ విజయంతో భారత్ ఐదు టీ20ల సిరీస్‌ను 3-0తో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


