Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇషాన్ కిషన్ అరుదైన ఘనత.. 39 ఏళ్ల రికార్డ్ బద్దలు!

టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనతను సాధించాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. సౌత్ జోన్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్‌కు నాయకత్వం వహిస్తున్న ఇషాన్ కిషన్.. అద్వితీయమైన బ్యాటింగ్‌తో 39 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటిన ఇషాన్ కిషన్.. రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడి 80 పరుగులు చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 350 పరుగులు సాధించాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా ఒక మ్యాచ్‌లో 350 పరుగులు చేయలేదు.

అతను జట్టులో ఉండటం మా అదృష్టం: ఇషాన్ కిషన్

అతను జట్టులో ఉండటం మా అదృష్టం: ఇషాన్ కిషన్

ఈ క్రమంలో రమన్ లంబా, గగన్ ఖోడా, లాల్ చంద్ రాజ్‌పుత్, వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డ్‌లను ఇషాన్ కిషన్ అధిగమించాడు. 1978 దులీప్ ట్రోఫీ ఫైనల్లో నార్త్ జోన్ తరఫున లంబా వెస్ట్ జోన్‌పై 320 పరుగులు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.

Ishan Kishan Creates History Breaks 39-Year-Old Duleep Trophy Record with 350 Runs vs South Zone

దులీప్ ట్రోఫీ‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..

ఇషాన్ కిషన్: 350 పరుగులు (270, 80)

రామన్ లాంబా: 320 పరుగులు (320, బ్యాటింగ్ చేయలేదు)

గగన్ ఖోడా: 300 పరుగులు (300, బ్యాటింగ్ చేయలేదు)

లాలాచంద్ రాజ్‌పుత్: 298 పరుగులు (23, 275)


విజయం దిశగా ఈస్ట్ జోన్..

దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ విజయం దిశగా సాగుతోంది. 372 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఈస్ట్ జోన్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(98 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80) దూకుడుగా ఆడగా.. శిఖర్ మోహన్(85 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 39 ఏళ్ల రికార్డ్ బద్దలు!

Also Read

చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 39 ఏళ్ల రికార్డ్ బద్దలు!

వైభవ్ సూర్యవంశీ(8), అభిమన్యు ఈశ్వరన్(3) తీవ్రంగా నిరాశపర్చారు. క్రీజులో కుమార కుశాగ్ర(34 బ్యాటింగ్), మహమ్మద్ ఖురైషి( సిక్స్‌తో 26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సౌత్ జోన్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, త్రిపురణ విజయ్, నిదీష్, షేక్ రషీద్ తలో వికెట్ తీసారు. ప్రస్తుతం ఈస్ట్ జోన్ 584 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ 708 పరుగులు చేయగా.. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది.

Story first published: Thursday, September 10, 2026, 10:00 [IST]
Other articles published on Sep 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+