Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 39 ఏళ్ల రికార్డ్ బద్దలు!

టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్స్ చరిత్రలోనే డబుల్ సెంచరీ బాదిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు. సౌత్ జోన్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న ఫైనల్లో ఈస్ట్ జోన్‌కు సారథ్యం వహిస్తున్న ఇషాన్ కిషన్.. 301 బంతుల్లో 250 పరుగులు చేసి ఈ ఫీట్ సాధించాడు.

1987లో అన్షుమన్ గైక్వాడ్ వెస్ట్ జోన్ కెప్టెన్‌గా.. నార్త్ జోన్‌తో జరిగిన ఫైనల్లో 216 పరుగులు చేసి ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత మరే సారథి ఈ ఘనతను అందుకోలేదు. 39 ఏళ్ల తర్వాత ఇషాన్ కిషన్ ఈ రికార్డ్‌ను అందుకున్నాడు.

Duleep Trophy 2026: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. ఈస్ట్ జోన్ భారీ స్కోర్!

Duleep Trophy 2026: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. ఈస్ట్ జోన్ భారీ స్కోర్!

39 ఏళ్ల తర్వాత..

ఓవరాల్‌గా దులీప్ ట్రోఫీ ఫైనల్లో డబుల్ సెంచరీ బాదిన ఏడో బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(1967), అన్షుమన్ గైక్వాడ్(1987), రమన్ లాంబా(1987), యూసఫ్ పఠాన్, చతేశ్వర్ పుజారా(2016), యశస్వి జైస్వాల్(2022) ఇషాన్ కిషన్ కంటే ముందు ఈ ఫీట్ సాధించారు.

Ishan Kishan Record-Breaking Double Ton Ends 39-Year Wait in Duleep Trophy 2026 Final

దులీప్ ట్రోఫీ ఫైనల్లో నమోదైన డబుల్ సెంచరీలు..

మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (1967) - 200

అన్షుమన్ గైక్వాడ్ (1987) - 216

రామన్ లాంబా (1987) - 320

యూసుఫ్ పఠాన్ - 210

చెతేశ్వర్ పుజారా - 256

గౌతమ్ గంభీర్ (2016)

యశస్వి జైస్వాల్ (2022) - 266

ఇషాన్ కిషన్ (2026) - 250

దినేష్ కార్తీక్ రికార్డ్ బద్దలు..

దులీప్ ట్రోఫీ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. ఈ క్రమంలో దినేష్ కార్తీక్ పేరిట ఉన్న రికార్డ్‌ను ఇషాన్ అధిగమించాడు. 2010 దులీప్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్ జోన్‌పై సౌత్ జోన్ తరఫున దినేష్ కార్తీక్ 183 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇషాన్ కిషన్‌కు ఇది రెండో డబుల్ సెంచరీ. 2016లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ 273 పరుగులు చేశాడు.

ఈస్ట్ జోన్ భారీ స్కోర్..

ఇషాన్ కిషన్ విధ్వంసంతో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 154 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లకు 684 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(273 బంతుల్లో 26 ఫోర్లు, 2 సిక్స్‌లతో 250)తో పాటు కుమార్ కుశాగ్ర(132 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) సెంచరీతో సత్తా చాటాడు.

అతను జట్టులో ఉండటం మా అదృష్టం: ఇషాన్ కిషన్

Also Read

అతను జట్టులో ఉండటం మా అదృష్టం: ఇషాన్ కిషన్

శిఖర్ మోహన్(120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85), అభిమన్యు ఈశ్వరన్(86 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 72) హాఫ్ సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 44) దూకుడుగా ఆడాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురణ విజయ్, చామ మిలింద్ రెండేసి వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. సిరాజ్ పూర్తిగా తేలిపోయాడు. క్రీజులో ఖురాషి(36 బ్యాటింగ్)‌తో పాటు మహమ్మద్ షమీ(28 బ్యాటింగ్) ఉన్నాడు.

Story first published: Monday, September 7, 2026, 16:32 [IST]
Other articles published on Sep 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+