Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కావ్యమారన్-అనిరుధ్ పెళ్లి.. కట్నంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌?

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి నిశ్చయమైంది. నవంబర్ 10న గ్రీస్ వేదికగా వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుకను నిర్వహించనుండగా.. నవంబర్ 21న చెన్నై వేదికగా వివాహ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే తమ కూమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవ్వాలని సన్‌నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్ ప్రముఖులను కలుస్తున్నారు. శుక్రవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్‌ను సతీ సమేతంగా కలిసి వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించారు. దాంతోనే కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి ఖాయమైందనే విషయం వెలుగులోకి వచ్చింది.

కావ్య పాపతో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు ఆహ్వానం!

కావ్య పాపతో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు ఆహ్వానం!

పుకార్లు నిజమైన వేళ..

వాస్తవానికి ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని గతేడాదిన్నరగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలను అనిరుధ్‌తో పాటు కావ్యమారన్ టీమ్ ఖండించింది. సన్‌నెట్ వర్క్ అయితే పలు మీడియా సంస్థలకు నోటీసులు కూడా జారీ చేసి మరీ హెచ్చరించింది. దాంతో గత కొంతకాలంగా ఈ వార్తలకు బ్రేక్ పడింది.

Is SRH the Dowry for Kavya Maran and Anirudh Ravichander s Wedding Fan s Hilarious Question Goes Viral

కానీ అందరి ఊహాగానాలు నిజం చేస్తూ ఈ ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యేందుకు సిద్దమయ్యారు. అనిరుధ్, కావ్య మారన్ ఏజ్ గ్యాప్ ఏడాది మాత్రమేనని తెలుస్తోంది. అనిరుధ్‌కు 36 ఏళ్లు కాగా.. కావ్య మారన్‌కు 35 ఏళ్లు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

కట్నంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్..?

కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి వార్తల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. కావ్య మారన్‌‌ను పెళ్లి చేసుకుంటున్న అనిరుధ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ను కట్నంగా ఇస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ సన్‌గ్రూప్ అధినేత కళానిధి మారన్ ఆస్థి మొత్తం కావ్యమారన్‌కే అనే విషయం చాలా మంది తెలియదు.

అనిరుధ్‌తో కావ్యమారన్ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన నటుడు!

Also Read

అనిరుధ్‌తో కావ్యమారన్ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన నటుడు!

రూ.30 వేల కోట్లకు ఏకైక వారుసురాలు..

కళానిధి మారన్ -కావేరి మారన్ దంపతుల ఏకైక కుమార్తె కావ్యా మారన్. మీడియా టైకూన్‌లో ఒకరైన కళానిధి మారన్‌.. టీవీ, రేడియో, వార్తా పత్రికలు, డీటీహెచ్ తదితర వ్యాపారాలతో పాటు బడా సినీ నిర్మాతగానూ రాణిస్తున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం కళానిధి మారన్ నెట్ వర్త్ రూ.25-30 వేల కోట్ల ఉంటుందని అంచనా. ఈ ఆస్థి మొత్తానికి ఏకైక వారుసురాలు కావ్య మారన్. ఈ పూర్తి ఆస్థి ఆమెకే దక్కుతుంది.

కావ్య మారన్ కూడా తండ్రి వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆస్థులను రెట్టింపు చేసింది. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ బాధ్యతలు చేపట్టిన ఆమె.. జట్టును ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో పాటు ది హండ్రెడ్ లీగ్‌లోనూ జట్లను కొనుగోలు చేసింది. ఈ మూడు జట్లతో పాటు సన్ మ్యూజిక్ వ్యవహారాలను కూడా కావ్యా మారన్ పర్యవేక్షిస్తుంది. ఆమె నెట్ వర్త్ రూ. 400-500 కోట్లు ఉంటుందని అంచనా.

టాప్ మ్యూజిక్ డైరెక్టర్..

కావ్య మారన్ తరహాలో అనిరుధ్‌కు ఆస్థులు లేకపోయినా.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు ఉంది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా మేనల్లుడైన అనిరుధ్... వై దిస్ కొలవెరి డీ పాటతో గుర్తింపు పొందాడు. ఆ తర్వాత వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. తమిళంతో పాటు తెలుగు సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

తెలుగులో ఇటీవల విడుదలైన ప్యారడైజ్-2తో పాటు కళానిధి మారన్ నిర్మించిన జైలర్-2కు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసే అనిరుధ్ నెట్ వర్త్ రూ.50-70 కోట్లు ఉంటుందని అంచనా. ఈ క్రమంలోనే అనిరుధ్ చాలా లక్కీ అని, బంగారం లాంటి కావ్య పాపతో పాటు కోట్ల రూపాయల ఆస్థి వస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Story first published: Saturday, October 17, 2026, 16:05 [IST]
Other articles published on Oct 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+