భారత్ గెలవాలంటే.. ఆ ఆర్‌సీబీ హీరోను జట్టులోకి తీసుకోవాలి: ఇర్ఫాన్ పఠాన్
అంతర్జాతీయ టీ20ల్లో వరల్డ్ ఛాంపియన్ టీమిండియా వరుస పరాజయాలను ఎదుర్కొంటుంది. పసికూన ఐర్లాండ్ చేతిలో రెండు టీ20ల సిరీస్‌ను కోల్పోయిన భారత్.. ఇంగ్లండ్ గడ్డపై అదే పేలవ ప్రదర్శనను కొనసాగించింది. నయా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒక్క విజయం సాధించలేకపోయింది.
ఈ నేపథ్యంలోనే టీమ్ కాంబినేషన్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్‌ను భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ప్రస్తుత భారత టీ20 జట్టులో సమతుల్యత లోపించిందని, ఆ లోపాన్ని సరిదిద్దేందుకు పటీదార్ సరైన ఎంపికని పఠాన్ పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు.

రజత్ పాటిదార్‌ను తీసుకోవాలి..
'ప్రస్తుత భారత టీ20 జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఎక్కువగా ఉన్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో సమతుల్యం రావాలంటే కుడిచేతి వాటం కలిగిన రజత్ పాటిదార్‌ను జట్టులోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. తదుపరి టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా చాలా సమయం అందుబాటులో ఉన్నందున, పటీదార్ లాంటి ప్రతిభావంతుడికి తగిన అవకాశాలు ఇచ్చి పరీక్షించాలి.’అని పఠాన్ సూచించాడు.
32 ఏళ్ల రజత్ పాటిదార్ ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేయకపోయినప్పటికీ.. దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతను 106 ఇన్నింగ్స్‌ల్లో 160.08 స్ట్రైక్ రేట్‌తో 3,389 పరుగులు చేశాడు. అంతేకాకుండా.. తన సారథ్యంలో ఆర్‌సీబీకి వరుసగా రెండు టైటిళ్లు అందించాడు. కానీ అతని వయసు ఎక్కువగా ఉందనే కారణంతో సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. కనీసం ఇర్ఫాన్ పఠాన్ సూచనలతోనైనా మేనేజ్‌మెంట్ రజత్ పాటిదార్‌కు అవకాశం ఇస్తుందో లేదో చూడాలి.
వెనుకంజలో భారత్..
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 0 1తో వెనుకంజలో ఉంది. తొలి టీ20 వర్ఫార్పణం కాగా రెండో టీ20లో రవి బిష్ణోయ్ చెత్త బౌలింగ్‌తో ఓటమిపాలైంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం రాత్రి 10 గంటలకు జరగనుంది. వరుస పరాజయాలతో నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై ఒత్తిడి పెరుగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

