ఆ తెలుగు హీరోయిన్‌తో పృథ్వీ షా పెళ్లి పెటాకులేనా?
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ తీవ్ర ఆటంకాలను ఎదుర్కొంటున్నాడు. అండర్ 19 ప్రపంచకప్ విజయంతో తారా జువ్వలా భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో పాటు చెడు స్నేహాలు పృథ్వీ షా కెరీర్‌ను నాశనం చేశాయి.
దాంతో భారత క్రికెట్ ముఖ చిత్రంగా ఎదుగుతాడని భావించిన పృథ్వీ షా.. ఐపీఎల్ టీమ్‌లో కూడా చోటు దక్కించుకోలేని దయనీయస్థితికి చేరాడు. దేశవాళీ స్టార్‌గానే కెరీర్‌ను ముగించే దిశగా సాగుతున్నాడు. 24 ఏళ్లకే పొట్ట, బట్టతో అంకుల్‌లా మారిపోయిన పృథ్వీ షా.. తన తప్పిదాలను తెలుసుకొని టీమిండియాలోకి పునరాగమనం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
నేను మోసపోయా..
ఇదే క్రమంలో సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్న తన స్నేహితురాలు, నటి ఆకృతి అగర్వాల్‌తో ఈ ఏడాది మార్చిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని పృథ్వీ షా చాలా సంతోషంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అంతేకాకుండా ఆకృతిపై చాలా పోస్టుల్లో తన ప్రేమను చాటుకున్నాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జోడీ పెళ్లి పీటలెక్కలేదు.

అంతేకాకుండా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆకృతి అగర్వాల్ పెట్టిన పోస్ట్‌లు వీరి బంధంపై అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి. పెళ్లి పెటాకులేనా? నిశ్చితార్థంతోనే వీరి బంధం ముగిసిందా? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. 'నేను చాలా సార్లు మోసపోయా. కానీ ఒక్క మాట కూడా అనలేదు. అతనితో కలిసి జీవితంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాక ఇదంతా నమ్మలేకపోతున్నా. అతని గురించి సోషల్ మీడియాలో చూసిందంతా నిజమే. వందంతులన్నీ వాస్తవమే'అని ఆమె వరుస పోస్ట్‌ల్లో పేర్కొంది.
పాపం.. పృథ్వీ షా
ఈ పోస్ట్‌ల్లో పృథ్వీ షాతో పాటు ఎవరి పేర్లను ఆమె ప్రస్తావించలేదు. కానీ పృథ్వీ షాను ఉద్దేశించే ఈ పోస్ట్‌లు పెట్టిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పృథ్వీ షాను అన్‌ఫాలో చేయని ఆకృతి.. అతనితో ఉన్న ఫొటోలనూ కూడా తొలగించలేదు. అంతేకాకుండా 'అపార్థం చేసుకున్నారు'అని మరో పోస్ట్ పెట్టింది. అయితే పృథ్వీ షాతో ఏదో చిన్న వాగ్వాదం జరిగి ఉన్నట్లుందని, ఆ కోపంలోనే ఈ పోస్ట్‌లు పెట్టవచ్చని మరికొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా పృథ్వీ షా తలరాతనే సరిగ్గా లేనట్లుందని అతని అభిమానులు జాలి చూపుతున్నారు.
పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. బాహటంగానే తిరిగిన ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా కూడా ఫొటోలు షేర్ చేశారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి కొనుగోలు చేయడంతో ఈ టోర్నీ ముగిసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఈ మెగా టోర్నీలో పృథ్వీ షాకు ఒక్క అవకాశం కూడా రాలేదు.

'త్రిముఖ' తెలుగు మూవీతో..
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఆకృతి అగర్వాల్..సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, నటిగా రాణిస్తోంది. ముంబైలోని నిర్మలా మెమోరియల్ ఫాండేషన్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ డిగ్రీని పూర్తి చేసింది.
కరోనా సమయంలో డ్యాన్స్, లిప్ సింక్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 3.4 మిలియన్ల (34 లక్షలు) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమెకు ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. రాజేష్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన 'త్రిముఖ' అనే తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ఆమె హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

