భువనేశ్వర్ కుమార్‌ను అనవసరంగా ఆడించారు: ఇర్ఫాన్ పఠాన్
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను అనవసరంగా ఆడించారని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. టీ20 సిరీస్‌కు బదులు భువనేశ్వర్ కుమార్‌ను వన్డేలకు సిద్దం చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.
ఈ ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-2తో గెలుచుకున్నప్పటికీ.. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. దాంతో జట్టు నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ తీవ్రంగా నిరాశపర్చాడు. నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క వికెట్ తీసిన భువనేశ్వర్ కుమార్..11.25 ఎకానమీతో 180 పరుగులు సమర్పించుకున్నాడు.

తాజాగా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ప్రదర్శనపై మాట్లాడిన పఠాన్.. అతనికి బదులుగా యువ బౌలర్లను ఆడిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. 'ఈ సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్‌ను ఆడించి సెలక్టర్లు ఘోర తప్పిదం చేశారు. అతను మంచి బౌలర్. అనుభవజ్ఞుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. అతన్ని టీ20ల్లో ఆడించడం సరికాదు. వన్డే ప్రపంచకప్ దగ్గర్లోనే ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్ కోసం భువనేశ్వర్ కుమార్ సిద్దం చేస్తే అది అర్థవంతంగా ఉండేది.
భువనేశ్వర్ కుమార్ సరిగ్గా ఆడలేదని నేను ఈ మాట అనడం లేదు. అతనికి ఈ సిరీస్ ఏ మాత్రం కలిసిరాలేదు. పవర్ ప్లే తొలి ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేసినప్పటికీ.. ఆ తర్వాత పరుగులిచ్చేశాడు. ఇది ఏ బౌలర్‌కైనా జరిగేదే. అయితే అతని నైపుణ్యం విషయంలో ఎలాంటి సందేహం లేదు. భువనేశ్వర్ కుమార్‌ను ఈ సిరీస్ కోసం తిరిగి పిలిచే బదులు.. మయాంక్, ప్రిన్స్ యాదవ్‌లాంటి యువ బౌలర్లపై మరింత ఫోకస్ పెట్టాల్సింది.'అని పఠాన్ పేర్కొన్నాడు.
ఆఖరి టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(32 బంతుల్లో 5 ఫోర్లు,5 సిక్స్‌లతో 61), శ్రేయస్ అయ్యర్(23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆడమ్ మిల్నే(4/19) నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు.
అనంతరం న్యూజిలాండ్ 18 ఓవర్లలోనే 3 వికెట్లకు 195 పరుగులు చేసి గెలుపొందింది. టీమ్ సీఫెర్ట్(50 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 93), గ్లేన్ ఫిలిప్స్(39 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


