Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: అర్థ శతకాలతో చెలరేగిన ఇషాన్, శ్రేయస్.. కివీస్ ముంగిట భారీ స్కోరు!

IND vs NZ:హామిల్టన్‌లోని సెడన్ పార్క్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే 5 మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోగా.. ఈ చివరి మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను 4-1 తేడాతో ముగించాలని పట్టుదలతో ఉంది.

Viral Video: 'వైభవ్ నిరసన చేస్తున్నాడు!': అక్షర్ పటేల్ కామెడీ మామూలుగా లేదుగా!

Viral Video: 'వైభవ్ నిరసన చేస్తున్నాడు!': అక్షర్ పటేల్ కామెడీ మామూలుగా లేదుగా!

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆదిలోనే ఇబ్బందుల్లో పడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(1) రెండో ఓవర్లోనే ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో ఔట్ కాగా.. మరో ఓపెనర్ సంజూ శాంసన్(4) కూడా మిల్నే బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. దీంతో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయిన భారత్‌ను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లు తమ అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు ఏకంగా 93 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇషాన్ కిషన్ కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసి బ్లెయిర్ టిక్నర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ వేగంగా 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి వెంటనే పెవిలియన్ దారి పట్టాడు.

IND vs NZ 5th T20I Ishan Kishan and Shreyas Iyer Fifties Propel India to 191 8 vs New Zealand

మిడిలార్డర్లో తిలక్ వర్మ(5) త్వరగానే ఔటైనప్పటికీ.. నమన్ ధీర్ 23 బంతుల్లో 33 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 22 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 190 పరుగులు దాటగలిగింది. చివరి ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్(6) వికెట్లను తీసిన న్యూజిలాండ్ స్టార్ పేసర్ ఆడమ్ మిల్నే మొత్తం 4 వికెట్లతో చెలరేగాడు. అలాగే నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్ లకు చెరో 2 వికెట్లు దక్కాయి.

 IND vs NZ: సంజూ శాంసన్ మళ్లీ ఫ్లాప్.. టపటపా రెండు వికెట్లు డౌన్!

Also Read

IND vs NZ: సంజూ శాంసన్ మళ్లీ ఫ్లాప్.. టపటపా రెండు వికెట్లు డౌన్!

ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో రెండు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌లకు ప్లేయింగ్-11లో చోటు దక్కింది. మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్‌లు తుది జట్టుకు దూరం కాగా.. యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లో కూడా అవకాశం లభించలేదు. మరోవైపు న్యూజిలాండ్ జట్టులో మ్యాథ్యూ ఫిషర్ స్థానంలో బ్లెయిర్ టిక్నర్ తుది జట్టులోకి వచ్చాడు. 192 పరుగుల లక్ష్యంతో న్యూజిలాండ్ తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.

Story first published: Sunday, November 1, 2026, 14:45 [IST]
Other articles published on Nov 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+