Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: SRHలోకి నటరాజన్ రీఎంట్రీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ట్రేడ్ డీల్!

ఐపీఎల్ 2027 సీజన్‌ మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అభిమానులకు గుడ్ న్యూస్. ఆరెంజ్ ఆర్మీ మాజీ పేసర్, యార్కర్ల కింగ్ టీ నటరాజన్ జట్టులోకి తిరిగొచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్లేయర్ స్వాప్ ట్రేడ్ డీల్ ద్వారా నటరాజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తెచ్చుకుంది. అతనికి బదులుగా లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీని వదులుకుంది.

IPL 2027: ఆ ఐదుగురు ఔట్.. SRH వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

IPL 2027: ఆ ఐదుగురు ఔట్.. SRH వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

ఈ ప్లేయర్ స్వాప్ డీల్‌ను ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా ధ్రువీకరించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కూడా జట్టులోకి నటరాజన్ తిరిగొచ్చాడనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నటరాజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తోనే క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యాడు.

IPL 2027 T Natarajan Returns to Sunrisers Hyderabad for Rs 5 Crore Zeeshan Ansari Traded to DC

2020-2024 వరకు మొత్తం ఐదు సీజన్ల పాటు ఆరెంజ్ ఆర్మీకి ప్రాతినిథ్యం వహించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2024 సీజన్‌లో 19 వికెట్లు పడగొట్టి జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. కానీ ఆ తర్వాత గాయాల బెడదతో జట్టుకు దూరమై ఫామ్‌ కోల్పోయాడు.

IPL 2027: కావ్యమారన్‌కు బిగ్ షాక్.. అప్‌కమింగ్ సీజన్‌కు SRH కెప్టెన్ దూరం!

Also Read

IPL 2027: కావ్యమారన్‌కు బిగ్ షాక్.. అప్‌కమింగ్ సీజన్‌కు SRH కెప్టెన్ దూరం!

ఐపీఎల్ 2025 మెగా వేలంలో నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ట్రేడ్‌ డీల్‌లో భాగంగా అతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.5 కోట్ల సవరించిన ఫీజుతో తిరిగి జట్టులోకి తీసుకుంది. నటరాజన్ పునరాగమనంతో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ బలం పెరగనుంది.

మరోవైపు జీషన్ అన్సారీ మాత్రం తన బేస్ ప్రైజ్ రూ.40 లక్షలతోనే ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి చేరాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జీషన్స్ అన్సారీ ఆ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లే పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తన అరంగేట్ర మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసాడు. కానీ ఆ తర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయాడు. దాంతోనే ఐపీఎల్ 2026 సీజన్‌లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు.

శివాంగ్ కుమార్, హర్ష్‌ దూబే అదరగొట్టడంతో జీషన్ అన్సారీ అవసరం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి పేస్ విభాగాన్ని పటిష్టం చేసింది. ఈ ట్రేడ్ డీల్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదిరిపోయే డీల్ అంటూ టీమ్ ఓనర్ కావ్యమారన్‌ను కొనియాడాడు.

Story first published: Wednesday, October 14, 2026, 18:21 [IST]
Other articles published on Oct 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+