IPL 2027: కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్..?
టీమిండియా టీ20 ఫినిషర్ రింకూ సింగ్‌కు భారీ ప్రమోషన్ లభించనుందా? ఐపీఎల్ 2027 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) సారథ్య బాధ్యతలు చేపట్టబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన యూపీ టీ20 లీగ్ 2026 సీజన్‌లో రింకూ సింగ్ సారథ్యంలో మీరట్ మావెరిక్స్ విజేతగా నిలిచింది. దాంతో కేకేఆర్ తదుపరి కెప్టెన్ రింకూ సింగ్ అంటూ ఆ జట్టు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో మీరట్ మావెరిక్స్ టీమ్.. భువనేశ్వర్ కుమార్ సారథ్యంలోని లక్నో ఫాల్కన్స్ జట్టును 94 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత జట్టులో చోటు కోల్పోయిన రింకూ సింగ్.. కెప్టెన్‌గా ఈ లీగ్‌లో అదరగొట్టాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం బ్యాటర్‌గా తీవ్రంగా నిరాశపర్చాడు.
ఓపెనర్ దివ్యాంశ్ జోషి 40 బంతుల్లో 105 పరుగులు చేయడంతో మీరట్ మావెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 203 పరుగులు చేసింది.అనంతరం లక్నో ఫాల్కన్స్ 16 ఓవర్లలో 109 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

10 మ్యాచ్‌ల్లో 9 విజయం..
ఈ లీగ్‌లో మీరట్ మావెరిక్స్ రింకూ సారథ్యంలో 10 మ్యాచ్‌లు ఆడి 9 గెలిచింది. అద్భుతమైన సారథ్య నైపుణ్యాలను ప్రదర్శించాడు. దాంతో కేకేఆర్ కెప్టెన్సీ రేసులోకి రింకూ సింగ్ దూసుకొచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అజింక్యా రహానేకు డిప్యూటీగా వ్యవహరించాడు. అతను రిటైర్మెంట్ ప్రకటించడంతో కేకేఆర్‌కు నయా కెప్టెన్‌ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రింకూ సింగ్ ఒక అద్భుతమైన ఆప్షన్‌గా నిలిచాడు.
8 ఏళ్లుగా కేకేఆర్‌తోనే..
ఐపీఎల్ 2018 సీజన్‌లో అరంగేట్రం చేసిన రింకూ సింగ్.. గత 8 ఏళ్లుగా ఆ జట్టుకే ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 73 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అతను 1394 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్‌లోని ఐకానిక్ నరేంద్ర మోదీ స్టేడియంలో యశ్ దయాల్ బౌలింగ్‌లో ఆఖరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది కేకేఆర్‌ను గెలిపించడంతో రింకూ సింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


