Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Duleep Trophy 2026: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. ఈస్ట్ జోన్ భారీ స్కోర్!

టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. పరిమిత ఓవర్ల ఫామ్‌ను రెడ్ బాల్ ఫార్మాట్‌లోనూ కొనసాగించాడు. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2026‌లో భాగంగా సౌత్ జోన్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఈ ఫీట్ సాధించాడు. దులీప్ ట్రోఫీలో ఇషాన్ కిషాన్‌కు ఇదే తొలి సెంచరీ, డబుల్ సెంచరీ కావడం గమనార్హం.

కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఇషాన్ షో: టెస్ట్ టీమ్‌లోకి రీఎంట్రీకి బిగ్ స్టేట్‌మెంట్!

కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఇషాన్ షో: టెస్ట్ టీమ్‌లోకి రీఎంట్రీకి బిగ్ స్టేట్‌మెంట్!

రెండో రోజు ఆట సెకండ్ సెషన్‌లో దేవదత్ పడిక్కల్ బౌలింగ్‌లో బౌండరీ బాది 270 బంతుల్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. తొలి రోజు ఆటలో 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్.. రెండో రోజు అదే జోరును కొనసాగించాడు. ఓపికగా ఆడి వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. 204 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్.. 270 బంతుల్లో ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

Ishan Kishan Smashes Double Century as East Zone Dominate South Zone in Duleep Trophy 2026 Final

డబుల్ సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్.. భారీ సిక్సర్లతో సౌత్ జోన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో 30 బంతుల వ్యవధిలోనే 250 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఆ వెంటనే తొడ కండరాలు పట్టేడయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

ఇషాన్ కిషన్ విధ్వంసంతో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 130 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్లకు 612 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(273 బంతుల్లో 26 ఫోర్లు, 2 సిక్స్‌లతో 250)తో పాటు కుమార్ కుశాగ్ర(132 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) సెంచరీతో సత్తా చాటాడు.

Viral Video: వైభవ్ సూర్యవంశీ vs తిలక్ వర్మ.. డిష్యూం.. డిష్యూం! (వీడియో)

Also Read

Viral Video: వైభవ్ సూర్యవంశీ vs తిలక్ వర్మ.. డిష్యూం.. డిష్యూం! (వీడియో)

శిఖర్ మోహన్(120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85), అభిమన్యు ఈశ్వరన్(86 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 72) హాఫ్ సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 44) దూకుడుగా ఆడాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురణ విజయ్, చామ మిలింద్ రెండేసి వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. సిరాజ్ పూర్తిగా తేలిపోయాడు. క్రీజులో అనుకుల్ రాయ్(40 బ్యాటింగ్)తో పాటు ఖురాషి(1 బ్యాటింగ్) ఉన్నాడు.

Story first published: Monday, September 7, 2026, 14:00 [IST]
Other articles published on Sep 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+